కొలతలు

1) విద్యుత్ ప్రవాహ తీవ్రత ఎందులో కొలుస్తారు ?
జ: ఆంపియర్లు
2) ఉష్ణోగ్రత, కాంతి ఉద్దీపన తీవ్రతను ఎందులో కొలుస్తారు?
జ: డిగ్రీ కెల్విన్, కెండెలాలో కొలుస్తారు.
3) వస్తువుల పొడవును ఖచ్చితంగా కొలిచే పరికరం ఏది?
జ: వెర్నియర్ కాలిపర్స్
4) ద్రవాల ఘనపరిమాణం కొలవడానికి దేన్ని ఉపయోగిస్తారు?
జ: బ్యూరెట్లు, పిపెట్స్
5) ద్రవాల తారతమ్య సాంద్రత కొలవడానికి దేన్ని ఉపయోగిస్తారు?
జ: సాంద్రత బుడ్డీ
6) పేపర్ నాణ్యతను కొలిచే GSM అంటే ఏంటి ?
జ: GSM - Gram sper square meter
7) డోలనా వర్తన కాలం దేని మీద ఆధారపడదు?
జ: కంపర పరిమితి
8) రిజర్వాయర్లలో నీటిని TMC ల్లో కొలుస్తారు. TMC లు అంటే ?
జ: Thousand million cubic feet
9) నది వెడల్పును కొలిచే పద్దతి ఏంటి ?
జ: త్రిభుజీకరణ
10) ఒక కిలోగ్రాము భారం ఎంత ?
జ: 9.8 న్యూటన్
11) నదుల్లో నీటి ప్రవాహాన్ని దేంతో కొలుస్తారు ?
జ: క్యూసెక్కులు
12) కాలాన్ని కొలవడానికి ఖచ్చితమైన గడియారం ఏది ?
జ: పరమాణు గడియారం
13) సముద్రాల దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ?
జ: నాటికల్ మైళ్ళు
14) మెమోరీ కార్డుల కెసాసిటీ కొలవడానికి ఉపయోగించేది GBలు. ఇందులో G అంటే ఎంత ?
జ: 10
15) ఒక కిలో బైట్ మెమోరీ అంటే ?
జ: 1024 బైట్స్