క్షారమృతిక లోహాలు, శక్తి మార్పులు
1) గ్రూప్ 2A మూలకాలను ఏమంటారు?
జ) మృత్తిక లోహాలు
2) రేడియో ధార్మిక స్వభావమున్న క్షార మృత్తిక లోహం ఏది?
జ) రేడియం
3) ఒకరసాయన చర్యలో ఉష్ణము గ్రహించబడితే దానిని ఏమంటారు?
జ) ఉష్ణగ్రాహక చర్య
4) పదార్దం యొక్క ఒక గ్రాము అణుభారాన్ని ఏమంటారు?
జ) మోల్
5) ప్రకృతిసిద్దంగా సంభవించే ఉష్ణగ్రాహక చర్యకు ఉదాహరణ ఏది?
జ) కిరణజన్య సంయోగక్రియ
6) రసాయన చర్యలో కొత్త మార్పులేవీ లేకుండా చర్యావేగాన్ని మార్పు చేసే పదార్ధాన్ని ఏమంటారు?
జ) ఉత్ప్రేరకం
7) గ్రామ్ పరమాణుభారం లేదా అణుభారాన్ని ఏమంటారు?
జ) మోల్
8) ఒక రసాయనిక చర్యను క్లుప్తంగా అర్దవంతంగా సూచించే సాంకేతిక సమీకరణాన్ని ఏమంటారు?
జ) రసాయన సమీకరణం