పదార్ధాలపై వేడిమి చర్య, సంకేతాలు, ఫార్ములాలు, సమీకరణాలు

1) పదార్దాలను వేడి చేసినపుడు ఘన రూపంలో నుంచి నేరుగా వాయు రూపంలోకి మారడాన్ని ఏమంటారు?
జ) ఉత్పతనం
2) మండుతున్న అగ్గిపుల్లను దగ్గరకు తీసుకొస్తే ప్రకాశవంతంగా మండే వాయువు ఏది?
జ) ఆక్సిజన్
3) పొటాషియం నైట్రేట్ ను వేడి చేస్తే ఏది విడుదలవుతుంది?
జ) ఆక్సిజన్
4) పొటాషియం లాటిన్ పేరు ఏంటి?
జ) కాలియం
5) CO2 వాయువు యొక్క అణుభారం ఎంత?
జ) 44
6) ఓజోన్ ఫార్ములా ఏది?
జ) O3.
7) సోడియం కార్బోనేట్ ను ఏమంటారు?
జ) వాషింగ్ సోడా
8) ఒక పరమాణువు లేదా పరమాణువుల సమూహం ఎలక్ట్రాన్ ను కోల్పోయినపుడు గానీ పొందినపుడు గానీ ఏర్పడిన దాన్ని ఏమంటారు?
జ) రాడికల్ లేదా అయాన్
9) అణుభారాన్ని గ్రాముల్లో సూచిస్తే దాన్ని ఏమంటారు?
జ) గ్రాము అణుభారం
10) ఎలక్ట్రాన్ ను కోల్పోవడం వల్ల ఏర్పడిన ప్రాతిపదికను ఏమంటారు?
జ) ధనాత్మక ప్రాతిపదిక లేదా క్షార ప్రాతిపదిక