పరమాణు నిర్మాణం

1) పదార్దం అతి సూక్ష్మకణాలైన అణు, పరమాణువుల సమ్మిళితమని ప్రతిపాదించింది ఎవరు?
జ: కణాడ్యుడు
2) పదార్దం అతి సూక్ష్మమైన పరమాణువులు కలిగి ఉంటుందని ప్రతిపాదించినది ఎవరు?
జ: డెమెక్రటిస్
3) ఉత్సర్గ నాళిక ప్రయోగాల ద్వారా పరమాణు నిర్మాణాన్ని, పరమాణువులోని మౌలిక కణాలను గురించి వివరించింది ఎవరు?
జ: విలియం క్రూక్స్
4) కాధోడ్, రుణ ద్రువ కిరణాలను కనిపెట్టినది ఎవరు?
జ: జె.జె.ధామ్సన్
5) ధన ధృవ కిరణాలను కనిపెట్టినది ఎవరు?
జ: గోల్డ్ స్టెయిన్
6) ధన ధృవ కిరణాల్లో అతి సూక్ష్మ కణాన్ని ఏమంటారు?
జ: ప్రోటాను
7) పరమాణులోని కణాలు ఏవి?
జ: ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్
8) ప్రోటాన్ కనుగొన్నది ఎవరు ? దీని సంకేతం ఏది?
జ: గోల్ట్ స్టెయిన్ దీని సంకేతము P.
9) ఎలక్ట్రాన్ ను కనుగొన్నది ఎవరు ? దీని సంకేతం ఏది?
జ: జె.జె.ధామ్సన్. దీని సంకేతము E
10) న్యూట్రాన్ ను కనుగొన్నది ఎవరు ? దీని సంకేతమేది?
జ: జేమ్స్ చాడ్విక్. దీని సంకేతం N.
11) మొట్ట మొదట పరమాణు నమూనాను ప్రతిపాదించినది ఎవరు?
జ: జె.జె. ధామ్సన్.
12) పరమాణు నమూనాను గ్రహ మండలముతో పోల్చింది ఎవరు ?
జ: రూధర్ ఫర్డ్
13) పరమాణువులోని ప్రోటాన్ ల, న్యూట్రాన్ల సంఖ్యను ఏమంటారు?
జ: పరమాణు ద్రవ్యరాశి లేదా ద్రవ్యరాశి సంఖ్య
14) పరమాణువులోని మధ్య భాగాన్ని ఏమంటారు?
జ: కేంద్రకం
15) ప్రోటాన్లు, న్యూట్రాన్లు కేంద్రకంలో ఉంటాయి. వీటిని ఏమంటారు?
జ: న్యూక్రియాన్స్

16) అయస్కాంత క్షేత్రంలో వర్ణపట రేఖలు చిన్నచిన్న రేఖలుగా విడిపోవడాన్ని ఏమని అంటారు?
జ) జీమన్ ఫలితం
17) విద్యుత్ క్షేత్రంలో వర్ణపట రేఖలు చిన్న చిన్న రేఖలుగా విడిపోవడాన్ని ఏమంటారు?
జ: స్లార్క్ ఫలితం
18) అజిముతల్ క్వాంటమ్ సంఖ్యను ఎవరు ప్రతిపాదించారు?
జ.సోమర్ ఫీల్డ్.
19) స్పిన్ క్వాంటమ్ సంఖ్యను ఎవరు ప్రతిపాదించారు?
జ.ఉలెన్ బెక్ , గౌడ్ స్మిట్
20) ఆర్బిటాల్ లో ఏది గోళాకారంగా ఉంటుంది?
జ: S
21) పరమాణు కేంద్రకానికి, బాహ్య ఆర్బిటాల్ కు గల మధ్య దూరాన్ని ఏమంటారు?
జ: పరమాణు వ్యాసార్దం
22) పరమాణు వ్యాసార్థాన్ని దేంతో కొలుస్తారు?
జ) ఆంగ్ స్ట్రామ్ ప్రమాణాలతో
23) అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ కలిగిన మూలకం ఏది?
జ) క్లోరిన్
24) ఒక రేడియోధార్మిక పదార్దంలోని సగం పరమాణువులు విఘటనం కావడానికి పట్టే కాలాన్ని ఏమంటారు?
జ) అర్థ జీవితకాలం
25) ఒకే పరమాణు సంఖ్య వేర్వేరు ద్రవ్యరాశి సంఖ్యలున్న ఒకే మూలకం పరమాణువులను ఏమంటారు?
జ) ఐసోటోపులు
26) ఒకే పరమాణు ద్రవ్యరాశి వేర్వేరు పరమాణు సంఖ్యలున్న వివిధ మూలకాల పరమాణువులను ఏమంటారు?
జ) ఐసోటోనులు
27) అత్యధిక అయనీకరణ శక్యం ఉన్న కణాలు ఏవి?
జ) ఎ-కణాలు
28) అత్యధికంగా చొచ్చుకొనిపోవు కణాలు ఏవి?
జ) Y కిరణాలు
29) ఒక స్థిర మూలకాన్ని రేడియోధార్మికత గల మూలకంగా మార్చడాన్ని ఏమంటారు?
జ) కృత్రిమ రేడియోధార్మికత
30) రేడియో ధార్మిక సోడియంను దేన్ని గుర్తించేందుకు ఉపయోగిస్తారు?
జ) రీరంలో రక్తం గడ్డ కట్టి ఉన్న భాగాన్ని గుర్తించేందుకు
31) కాన్సర్ కణాలు నిర్మూలించుటకు దేన్ని ఉపయోగిస్తారు?
జ) రేడియో ధార్మిక కోబాల్ట్
32) థైరాయిడ్ గ్రంధి పనితీరును దేంతో పరీక్షిస్తారు?
జ) అయోడిన్ ఐసోటోపుతో
33) కృత్రిమ రేడియో ధార్మికతను ఉపయోగించి శిలాజాల వయస్సు తెలుసుకునే పద్దతిని ఏమంటారు?
జ) రేడియో ధార్మిక డేటింగ్
34) ఎందులో కేంద్రక విచ్ఛిత్తి సూత్రం ఇమిడి ఉంది?
జ) అణుబాంబులో
35) ఏ నియమంపై న్యూక్లియర్ రియాక్టరులు పనిచేస్తాయి?
జ) నియంత్రిక శృంఖల చర్య