ప్రాణం తీసిన సరదా (వీడియో)

పాముతో ఓ వ్యక్తి సరదా అతని ప్రాణం తీసింది.
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో జరిగిన విషాదం ఇది. మంగళంపాడు గ్రామానికి చెందిన చిట్టేటి జగదీష్.. వీధుల్లో పాముల ఆటలు ఆడిస్తున్న వ్యక్తి దగ్గర పామును చూసి సరదా పడ్డాడు. విషం లేదనుకొని... ఆ పాముని మెడలో వేయించుకున్నాడు. స్నేహితులతో వీడియో తీయించుకున్నాడు. అయితే ప్రమాదవశాత్తు పాము జగదీష్ మెడ మీద కాటు వేసింది ..పరిస్థితి కాస్త విష మించడంతో హటాహుటిన ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ మార్గ మధ్యంలోని జగదీష్ (25) ప్రాణాలు కోల్పోయాడు