మూలకాల వర్గీకరణ

1) మూలకాల వర్గీకరణను మొదట చేపట్టినది ఎవరు?
జ) 1817 డాబర్నీర్
2) అష్టక సిద్దాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
జ) జాన్ న్యూలాండ్స్
3) పరమాణు ధర్మం మూలకాల వర్గీకరణకు ఆధారం కావాలని ఎవరు సూచించారు?
జ) మెండలీఫ్
4) జడ వాయువులు ఏవి?
జ) హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్
5) అత్యధిక రుణ విద్యుదాత్మకత కలిగిన మూలకం ఏది?
జ) ఫ్లోరిన్
6) పరమాణు పరిమాణాన్ని ఏ ప్రమాణాల్లో కొలుస్తారు?
జ) ఆంగ్ స్ట్రామ్