రసాయనిక చర్యల్లో రకాలు, నీరు సంఘటిత మూలకాలు
1) రెండు లేదా అంతకంటేఎక్కువ పదార్దాలు కలిసి ఒకే పదార్దంగా ఏర్పడటన్నిఏమంటారు?
జ) రసాయన సంయోగం
2) ఒక పదార్దం విడిపోయి రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్దాలను ఏర్పరచడాన్ని ఏమంటారు?
జ) రసాయన వియోగం
3) రెండు పదార్దాలు వాటి మూలకాలు లేదా ప్రాతిపదికలను పరస్పరం మార్చుకునే చర్యను ఏమంటారు?
జ) ద్వంద్వ వియోగం
4) నీరు రసాయనిక నామం ఏది?
జ) హైడ్రోజన్ మోనాక్సైడ్
5) విద్యుత్తును ప్రవహింపజేస్తూ నీటిని దాని సంఘటిత మూలకాలుగా విడగొట్టడాన్ని ఏమంటారు?
జ) విద్యుత్ విశ్లేషణం
6) సబ్బుతో నురగని ఇవ్వని జలాన్ని ఏమంటారు?
జ) కఠిన జలం
7) ఏది నీటిలో ఉన్న హానికరమైన బాక్టీరియాను నాశనం చేస్తుంది ?
జ) క్లోరిన్
8) నీటిని ఏమని పిలుస్తారు ?
జ) యూనివర్సల్ ద్రావణి
9) ఘన పరిమాణాత్మకంగా గాలిలో ఎంత ఆక్సిజన్ ఉంటుంది?
జ) 5వ వంతు