లోహ సంగ్రహణ శాస్త్రం
1) మలినాలతో కూడిన ప్రకృతిలో లభించే సమ్మేళనాలను ఏమంటారు?
జ) ఖనిజాలు.
2) ధాతువును గాలిలేకుండా బాగా వేడిచేసి బాష్పశీల మలినాలను తొలగించడాన్ని ఏమంటారు?
జ) భస్మీకరణం
3) రక్తంలోని ఎందులో ఇనుము ఘటక పదార్దముగా ఉంటుంది?
జ) హిమోగ్లోబిన్
4) దుక్క ఇనుము లేదా పోత ఇనుములో కార్బన్ ఎంత శాతం ఉంటుంది?
జ) 3.4 శాతం
5) గాల్వనైజింగ్ పద్దతిలో ఇనుముపై దేన్ని పూతగా పూస్తారు?
జ) జింక్