01 & 02 APRIL CURRENT AFFAIRS QUIZ ( AP )

01 & 02 APRIL CURRENT AFFAIRS QUIZ ( AP )

ఆంధ్ర ఎగ్జామ్స్ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ :

https://play.google.com/store/apps/details?id=andhraexams.com

1. ప్రపంచ ఆర్థిక మాంద్యం పరిస్థితుల నుంచి ఏయే దేశాలు బయటపడవచ్చని  UNCTAD ప్రకటించింది ?

2. 2020 ఏప్రిల్ 01 నాటి నుంచి ప్రభుత్వ రంగంలోని పది బ్యాంకులు భారీ విలీనం అయ్యాయి.  దీంతో ప్రస్తుతం ఉన్న ఎన్ని బ్యాంకులు కనుమరుగు అవుతాయి ?

3. భారత వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ, MyGov తో కలసి కోవిడ్ 19 చాట్ బోట్ ను ఏర్పాటు చేసిన సోషల్ మీడియా దిగ్గజం ఏది ?

4. కోవిడ్ 19 పై పోరాటానికి ఆపరేషన్ నమస్తే పేరుతో కార్యక్రమాన్ని ప్రకటించిన భారతీయ సైన్యం ఏది ?

5. ప్రస్తుత విదేశీ వాణిజ్య విధానం ( 2015-20) ను ఎప్పటిదాకా పొడిగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ?

6. కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకునేందుకు టీమ్ 11 పేరుతో అంతర్గత శాఖా కమిటీలను ఏర్పాటుచేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?

7. ఇటీవల కేరళలో చనిపోయిన ఎ. రామచంద్రన్ ఏ రంగానికి చెందినవారు ?

8. కోవిడ్ 19 విజృంభణతో భారత్ లో నెలకొన్న అసాధారణ ఆరోగ్య, మానవ సంక్షోభాన్ని ఎదుర్కునేందుకు విప్రో లిమిటెడ్, విప్రో ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్, అజీమ్ ప్రేమ్ ఫౌండేషన్ ల తరపున ఎంత మొతాన్ని ఖర్చు చేస్తామని ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం విప్రో ప్రకటించింది ?

9. సైనిక అవసరాల కోసం Lockheed Martin Advanced Extremely High Frequency (AEHF) ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం ఏది ?

10. కామరాజ్ పోర్ట్ లిమిటెడ్ లో రూ.2,383 కోట్లతో 66.67శాతం వాటాను అమ్మడానికి కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది ?

11. బ్యాంకుల విలీనం తర్వాత ప్రభుత్వ రంగంలో ఎన్ని భారీ బ్యాంకులు (ఒక్కో భారీ బ్యాంక్ పరిమాణం రూ.8లక్షల కోట్లతో) ఉంటాయి ?

12. కరోనా వ్యాప్తితో దేశవ్యాప్తంగా 16 రైల్వే జోన్లలో మొత్తం ఎన్ని లక్షల ఐసోలేషన్ బెడ్లు ఏర్పాటు చేయడానికి రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది ?

13. ఎక్కువ కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను బట్టి కేంద్రం ఎన్ని హాట్ స్పాట్స్ ను గుర్తించింది ?

14. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతుందని ఐక్యరాజ్యసమితి కి చెందిన ఏ విభాగం నివేదికను వెల్లడించింది ?

15. జపాన్ ప్రభుత్వం ఫండింగ్ ఏజెన్సీ JICA  భారత్ లో ఏ ప్రాజెక్ట్ కోసం రూ.15,295 కోట్ల రుణాన్ని ఇచ్చేందుకు అంగీకరించింది ?

16. ప్రస్తుత అసాధారణ పరిస్థితుల కారణంగా ప్రపంచంలో 1.10 కోట్ల మంది పేదరికంలోకి వెళ్తారని ఏ అంతర్జాతీయ సంస్థ అంచనా వేసింది ?

17. కరోనా బాధితులకు అవసరమయ్యే వెంటిలేటర్ల సమస్య తీర్చడానికి సీ-పాప్ పరికరాలను తయారు చేస్తున్న సంస్థ ఏది ? (వీటిని గతంలో గురక బాధితులకు వాడేవారు )