01 & 02 MARCH 2020 CURRENT AFFAIRS ( TS & AP )

క్విజ్ రూపంలో రాయాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయండి
http://telanganaexams.com/01-02-march-2020-current-affairs-quiz-ts-ap/
01) వేల మైళ్ళు దాటిన సైబీరియన్ కొంగలు ప్రతి యేటా ఫిబ్రవరి చివరల్లో వచ్చి ఆరు నెలల పాటు ఏపీలోని ఎక్కడ గూడ్లు ఏర్పాటు చేసుకొని ఉంటాయి ?
ఎ) వెంకటాపురం (అనంతపురం జిల్లా)
బి) తెలినెలిపురం ( శ్రీకాకుళం జిల్లా)
సి) నేలపట్టు ( నెల్లూరు జిల్లా )
డి) కొల్లేరు సరస్సు ( తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా)
జ: ఎ సరైనది
02) ముంబై నుంచి వెలువడే శివసేన అధికార పత్రిక సామ్నాకు ఎడిటర్ గా ఎవరు నియమితులయ్యారు ?
ఎ) ఉద్ధవ్ ఠాక్రే
బి) ఏక్ నాథ్ షిండే
సి) సంజయ్ రావత్
డి) రశ్మీ ఠాక్రే
జ: డి సరైనది
03) మలేసియా కొత్త ప్రధానిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు ?
ఎ) మహయిద్దీన్ యాసిన్
బి) అబ్దుల్లా అహ్మద్ బదావి
సి) సుల్తాన్ అబ్దుల్లా అహ్మద్ షా
డి) మహతీర్ మహమ్మద్
జ: ఎ సరైనది
04) హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కు సంబంధించి ఈ కింది స్టేట్ మెంట్స్ లో సరైనది గుర్తించండి
1) 2027 నాటికి అమెరికా అపాచీ తరహా హెలికాప్టర్లను 500 వరకూ తయారు చేయాలని HAL లక్ష్యంగా పెట్టుకుంది
2) గతంలో తేలికపాటి పోరాట హెలికాప్టర్ (LCH), అధునాతన తేలికపాటి హెలికాప్టర్ (ALH) చేతక్ లను తయారు చేసింది
3) 10-12 టన్నుల బరువు ఉండి, రెండు మధ్యతరహా ఇంజిన్లు కలిగి యుద్ధ నౌకపై పరిమితంగా ఉండే చోటులో నిలిచి ఉంచడానికి వీలుగా రెక్కలను ముడిచివేసే హెలికాప్టర్లను తయారు చేయనుంది
4) 2023 నాటికి ప్రయోగపూర్వక తొలి హెలికాప్టర్ ను HAL తయారు చేయనుంది. ఇది సైన్యానికి మద్దతుగా గగనతలం నుంచి దాడులు చేయడం, రవాణా, యుద్ధ క్షేత్రంలో గాలింపు, సహాయ చర్యలకు ఉపయోగపడనుంది
ఎ) 1,2,3 సరైనవి
బి) 1,2,3,4 సరైనవి
సి) 2,3,4 సరైనవి
డి) 1,3,4 సరైనవి
జ: బి సరైనది
05) ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్ ను ఎంతగా ప్రవేశపెట్టారు ?
ఎ) రూ.3,310 కోట్లు
బి) రూ.3,350 కోట్లు
సి) రూ.3,210 కోట్లు
డి) రూ.3,110 కోట్లు
జ: ఎ సరైనది
06) కాలుష్యాన్ని, వాహనాల రద్దీని అరికట్టేందుకు యూరప్ లోని ఓ బుల్లి దేశం ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. ఉచితంగా ప్రజారవాణానిని ఉపయోగించుకునే అవకాశం ఇచ్చింది. ఆ దేశం పేరేంటి ?
ఎ) వాటికన్ సిటీ
బి) లక్సెంబర్గ్
సి) శాన్ మారినో
డి) జార్జియా
జ: బి సరైనది
07) ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్లతో శాంతి కోసం ఒప్పందం జరిగింది. తాలిబన్లకు సంబంధించి ఈ ప్రకటనల్లో సరైనవి ఏవి
ఎ) తాలిబ్ అంటే అరబిక్ భాషలో విద్యార్థి అని అర్థం.
బి) 1979 క్రిస్మస్ రోజున ఆఫ్గనిస్తాన్ లో ఆనాటి సోవియట్ యూనియన్ సైన్యం అడుగుపెట్టినప్పటి నుంచి 40యేళ్ళుగా అక్కడ హింస జరుగుతోంది
సి) 1979లో ఆ నాటి ఆఫ్గనిస్తాన్ అధ్యక్షుడు బాబ్రక్ కర్మల్ (కమ్యూనిస్ట్ పార్టీ) ఆహ్వానం మేరకు సోవియట్ సేనలు (రెడ్ ఆర్మీ) ఆ దేశంలోకి ప్రవేశించాయి
డి) 1990లో ఆప్ఘాన్ లో కల్లోలం నెలకొనప్పుడు కాందహార్ లో తాలిబన్ గ్రూపు ఏర్పాటైంది. మతబోధకుడైన ముల్లా ఒమర్ దీని నిర్మాత
1) అన్నీ సరైనవి
2) ఎ,బి,డి సరైనది
3) ఎ,బి,సి సరైనవి
4) బి,సి,డి సరైనవి
జ: 1 సరైనది
08) ఆంధ్రప్రదేశ్ లో 2020 ఫిబ్రవరి 1 నుంచి మీ పింఛన్లు మీ గడప వద్దకే కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామ సచివాలయాల ద్వారా వీటిని అందించారు. రాష్ట్రంలో మొత్తం ఎంతమందికి పెన్షన్స్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
ఎ) 50 లక్షల మందికి
బి) 60 లక్షల మందికి
సి) 65 లక్షల మందికి
డి) 75 లక్షల మందికి
జ: బి సరైనది
09) ప్రపంచంలో రెండో యువ బిలియనీర్ గా వార్తల్లోకి ఎక్కి రిటీష్ అగర్వాల్ ఏ స్టార్టప్ కంపెనీని వ్యవస్థాపకుడు ?
ఎ) జొమాటో
బి) స్విగ్గీ
సి) బైజూస్
డి) ఒయో హోటల్స్
జ: డి సరైనది
10) ఈ కింది రాష్ట్రాల్లో ఏది కుల ప్రాతిపదికన జనాభా లెక్కలు సేకరించాలని నిర్వహించాలని నిర్ణయించింది ?
ఎ) కేరళ
బి) బిహార్
సి) వెస్ట్ బెంగాల్
డి) ఒడిషా
జ: బి సరైనది
11) 2020 వరకూ దేశంలో ఎన్ని భాషలను క్లాసికల్ లాంగ్వేజెస్ గా గుర్తించారు ?
ఎ) 4
బి) 6
సి) 10
డి) 18
జ: బి సరైనది
12) భారత్ లో స్కూల్ విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అవగాహన కల్పించేందుకు నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ తో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏది ?
A) NASSCOM
B) FICCI
C) CII
D) T-HUB
జ: A సరైనది
13) జాతీయ సైన్స్ దినోత్సవం 2020 యొక్క నినాదం ఏది ?
A) Children in Science
B) Youth in Science
C) Women in Science
D) Artificial Intelligence in Science
Ans: C correct
14) ఇటీవల రెండు కోట్ల మంది వినియోగదారుల మైలు రాయిని దాటిన ఇండియన్ పేమెంట్స్ బ్యాంక్ ఏది ?
ఎ) ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్
బి) ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్
సి) ఫినో పేమెంట్స్ బ్యాంక్
డి) పేటీఎం పేమెంట్స్ బ్యాంక్
జ: బి సరైనది
Hai Friends,
మా www.andhraexams.com వెబ్ సైట్ ఫాలో అవుతున్న మీ అందరికీ ఓ శుభవార్త. ఇవాళ్టి నుంచి ANDHRA EXAMS యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో కూడా UPLOAD అయింది. మీరు ఈ కింది లింక్ ద్వారా యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన యాప్ ద్వారా కరెంట్ ఎఫైర్స్, డైలీ టెస్టులు, విద్యా, ఉద్యోగ సమాచారాన్ని మీకు అందిస్తాను. మీరు చూపిస్తున్న ఆదరణకు కృతజ్ఞతలు. మీకు వెబ్ సైట్ మోడల్ లోనే యాప్ ఉంటుంది... ఈ కింది లింక్ ద్వారా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి... మీతో పాటు... మీ స్నేహితులు, బంధువులకు కూడా ఈ లింక్ ఫార్వార్డ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్ బుక్ ..ఇతర సోషల్ మీడియా ద్వారా మన లింక్ ను ఫార్వార్డ్ చేసి దయచేసి సహకరించగలరు.
(ఎం. విష్ణుకుమార్, సీనియర్ జర్నలిస్ట్ )
ఆంధ్ర ఎగ్జామ్స్ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ :
https://play.google.com/store/apps/details?id=andhraexams.com