01 DEC 2022 కరెంట్ ఎఫైర్స్

అమెరికా స్టెల్త్ బాంబర్ ఖరీదు రూ.16,200 కోట్లు
- అమెరికాలో ఇప్పటి వరకు ఉన్న అత్యుత్తమ స్టెల్త్ బాంబర్ యుద్ధ విమానం బి-2 స్పిరిట్. దీని స్థానంలో అత్యాధుని బి-21 రైడర్లు త్వరలో చేరుతున్నాయి.
- ప్రపంచంలోనే ఇప్పటివరకు నిర్మించిన అత్యాధునిక సైనిక బాంబర్ విమానం ఇదేనని... దీన్ని తయారుచేసిన నాథ్రాప్ గ్రమ్మన్ సంస్థ తెలిపింది.
- ఆరో తరానికి చెందిన ఈ స్టెల్త్ బాంబర్ విమానాన్ని 2022 డిసెంబర్ 2న కాలి పోర్నియాలో ఆవిష్కరిస్తున్నారు.
- ఒక్కో బి-21 అధునాతన యుద్ధ విమానం రైడర్ కాస్ట్ దాదాపు రూ.16,200 కోట్లు. ప్రారంభంలో ఆరు రైడర్లను ఈ సంస్థ తయారు చేయనుంది.
- 2023లోపు ఇవి అమెరికా సైన్యంలో పూర్తి స్థాయిలో పనిచేస్తాయి. సంప్రదాయ, అణ్వాయుధాలతో పాటు.. భవిష్యత్తులో వాడే లేజర్ ఆయుధాలను కూడా ప్రయోగించే సామర్థ్యం ఈ బి-21 రైడర్లకు ఉంటుంది.
- ప్రత్యర్థులకు దొరక్కుండా ప్రపంచంలో ఏ లక్ష్యాన్నైనా ఈ బాంబర్లు ఛేదిస్తాయి.
LAC దగ్గర్లో అమెరికాతో భారత్ విన్యాసాలు : యుద్ధ అభ్యాస్ పై చైనా అభ్యంతరం
- 'యుద్ధ అభ్యాస్' పేరుతో భారత్-అమెరికా గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న సంయుక్త సైనిక విన్యాసాలపై చైనా అభ్యంతరం చెప్పంది.
- భారత్ సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. వాస్తవాధీన రేఖ (LAC)కు దగ్గర్లో నిర్వహిస్తున్న విన్యాసాలు.. 1993, 1996లో భారత్- చైనాల మధ్య కుదిరిన సరిహద్దు ఒప్పందాలకు విరుద్ధమని టోంది.
- రెండు దేశాల మధ్య పరస్పర విశ్వాసానికి ఏ మాత్రం కరెక్ట్ కాదని వాదిస్తోంది. అయితే 2020లో ఇవే ఒప్పందాలను ఉల్లంఘించిన చైనా... భారత్ భూభాగంలోకి చొరబడింది.
- అప్పుడు భారత్ అభ్యంతరాలను చైనా పట్టించుకోలేదు.
నిఖత్, శ్రీజలకు అర్జున అవార్డులు : శరత్ కమల్ కు ఖేల్ రత్న అవార్డు
- తెలంగాణ ప్లేయర్లు నిఖత్ జరీన్ (బాక్సింగ్), ఆకుల శ్రీజ (టీటీ) అర్జున అవార్డులు అందుకున్నారు.
- 2022 నవంబర్ 30న క్రీడా పురస్కారాల ప్రదాన్ భవన్ లో నిర్వహించిన ఉత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజేతలకు అవార్డులు అందించారు.
- దేశ అత్యున్నత క్రీడాపురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నను టేబుల్ టెన్నిస్ దిగ్గజం శరత్ కమల్ స్వీకరించారు. ఈ అవార్డుతో పాటు రూ.25 లక్షల నగదు బహుమతి, ఓ పతకం, గౌరవ పత్రం అందించారు.
- నిఖత్, శ్రీజతో పాటు ఈ ఏడాది 25 మంది అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. వీళ్ళల్లో షట్లర్లు హెచ్.ఎస్. ప్రణయ్, లక్ష్యసేన్, అథ్లెట్లు ఎల్డోస్ అవినాష్ తదితరులు ఉన్నారు.
- అర్జు అవార్డుతోపాటు రూ.15 లక్షల చొప్పున నగదు బహుమతి, జ్ఞాపిక, గౌరవ పత్రాలను రాష్ట్రపతి అందించారు.
కచ్ చిత్రాలు తీసిన ఓషన్ శాట్- 3
- ఏపీ తిరుపతి జిల్లాలోని షార్ నుంచి 2022 నవంబరు 26న PSLV-C54 రాకెట్ ద్వారా నింగిలోకి వెళ్లిన ఓషన్ శాట్- 3 (EOS-06), భూటాన్ శాట్ ఉపగ్రహాలు పనిచేయడం ప్రారంభించాయి.
- ఆ శాటిలైట్ ఫస్ట్ డేటా శాస్త్రవేత్తలకు చేరింది. ఓషన్ శాట్ ఉపగ్రహం గుజరాత్లోని కచ్ ప్రాంతంతోపాటు అరేబియా సముద్రం, హిమాలయాల ఇమేజ్ లు పంపింది.
- ఇవి తెలంగాణ షాద్ నగర్ లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుంచి స్వీకరించారు.
- ఓషన్ కలర్ మానిటర్ (ఓసీఎం), సీ సర్ఫేస్ టెంపరేచర్ మానిటర్ (ఎస్ఎస్ఎఎం) సెన్సార్ల ద్వారా వాటిని అభివృద్ధి చేసి బెంగళూరులోని కేంద్ర కార్యాలయానికి పంపారు.
ఏడాది పాటు కరెంట్ ఎఫైర్స్ Mock Testsతో పాటు ప్రతి రోజూ పేపర్ క్లిప్పింగ్స్ కోసం ఈ కింది లింక్ ద్వారా కేవలం రూ.100తో కోర్సును ఈ కింది లింక్ ద్వారా purchase చేయండి.