01 FEB CURRENT AFFAIRS

ఆంధ్రప్రదేశ్
1) 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జంట ఐటీ టవర్లను ఎక్కడ నిర్మించనున్నారు
జ: అమరావతి
2) ఫిబ్రవరి 2 నుంచి రాష్ట్ర ప్రభుత్వ నంది నాటకోత్సవాలు ఎక్కడ నిర్వహించనున్నారు
జ: తెనాలిలో
3) చెన్నైకి చెందిన SPI సినిమా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఏయే ప్రాంతాల్లో భారీ కుటుంబ వినోద కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు ?
జ: తిరుపతి, విశాఖ, విజయవాడ
4) రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రకటించిన విధానం ఏంటి
జ: ఏపీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ క్లౌడ్ హబ్ పాలసీ 2018-2020
5) రాష్ట్రంలోని 2.84 కోట్ల వ్యవసాయ భూముల వివరాలను పొందేందుకు వీలుగా ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు ఏది
జ: భూసేవ
6) వ్యవసాయ వ్యాపారవేత్తల (అగ్రి ఎంటర్ ప్రెన్యూర్స్) సదస్సు ఎక్కడ జరిగింది
జ: విజయవాడ

జాతీయం
6) స్కార్పిన్ శ్రేణికి చెందిన మూడో అత్యాధునిక జలంతర్గామి ముంబైలో జరిగిన కార్యక్రమంలో భారత నావికాదళంలో చేరింది. దాని పేరేంటి
జ: INS కరంజ్
7) ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రకటించిన ప్రజాస్వామ్య సూచీ జాబితాలోలో భారత్ స్థానం ఎంత ?
జ: 42
(నోట్: గతంలో 32వ స్థానం (2016)లో)
8) దుష్ప్రవర్తన కారణంగా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిపై వేటు వేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నిర్ణయించారు ?
జ:శ్రీనారాయణ్ శుక్లా
9) అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ నారాయణ్ శుక్లాపై వచ్చిన అభియోగాలు ఏంటి
జ: లఖ్ నవూలో నిషిద్ద జాబితాలో ఉన్న ప్రైవేటు వైద్య కళాలల విద్యార్థుల్ని చేర్చుకోవడం ఉత్తర్వులు
10) ఆదాయం పన్ను కేసులో ఏ బాలీవుడ్ నటుడి ఫాం హౌస్ ను ఐటీ శాఖ అటాచ్ చేసింది
జ: షారూక్ ఖాన్
11) ఇటీవల వివాదస్పదమై, ఇంటర్నెట్ నుంచి తొలగించిన రాంగోపాల్ వర్మచిత్రం ఏది
జ: గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (GST)
12) అంపైర్లతో గొడవకు దిగినందుకు ఏ హైదరాబాదీ క్రికెటర్ పై BCCI రెండు మ్యాచుల నిషేధం విధించింది
జ: అంబటి రాయుడు