03 MARCH 2020 CURRENT AFFAIRS ( AP )

క్విజ్ రూపంలో కావాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయండి
http://telanganaexams.com/03-march-2020-current-affairs-quiz-ts-ap/
NATIONAL
1) ప్రజల భాగస్వామ్యంతో భూగర్భ జలాల నిర్వహణ కోసం ఎన్ని కోట్ల రూపాయలతో అటల్ భూజల్ యోజన పతకాన్ని గుజరాత్, హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు ?
ఎ) రూ.6 వేల కోట్లు
బి) రూ.3 వేల కోట్లు
సి) రూ.10వేల కోట్లు
డి) రూ.5వేల కోట్లు
జ: ఎ సరైనది
2) ట్యాక్స్ చెల్లింపు దారులకు సాయపడేందుకు వివాదాల పరిష్కార పథకాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2020 కేంద్ర బడ్జెట్ లో ప్రకటించారు. దాని ప్రకారం 2020 మార్చి 31లోగా చెల్లిస్తే ఎలాంటి జరిమానాలు ఉండవు. ఆ పథకం పేరేంటి ?
ఎ) సబ్ కా సాథ్
బి) వివాద్ సే విశ్వాస్
సి) సర్వీస్ ట్యాక్స్ స్కీమ్
డి) హమ్ సే విశ్వాస్
జ: బి సరైనది
3) భారత్ జీడీపీ వృద్ధి రేటు 2019-20 సంవత్సరానికి 5.1 శాతంగా ఉండొచ్చని ఫిచ్ సొల్యూషన్స్ ప్రకటించింది. దాన్ని ప్రస్తుతం ఎంతకు తగ్గించింది ?
ఎ) 5.0 శాతం
బి) 4.75 శాతం
సి) 4.9శాతం
డి) 5.5 శాతం
జ: సి సరైనది
4) 2020 ఫిబ్రవరి నెలలో దేశంలో నిరుద్యోగ రేటు ఎంతగా నమోదైనట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ డేటా వెల్లడించింది ?
ఎ) 6.78 శాతం
బి) 7.78 శాతం
సి) 6.78 శాతం
డి) 9.78 శాతం
జ: బి సరైనది
5) అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ 2020 మే 11 నుంచి 17 వరకూ ఏ దేశంలోని అంటాల్యాలో జరిగే రెండో ప్రపంచ కప్ లో కాంపౌండ్ విభాగంలో భారత్ తరపున బరిలోకి దిగనుంది ?
ఎ) ఫిన్లాండ్
బి) చైనా
సి) జపాన్
డి) టర్కీ
జ: డి సరైనది
INTERNATIONAL
6) ఫిన్లాండ్ మొబైల్ దిగ్గజం నోకియా అధ్యక్షుడు, CEO గా ఉన్న భారత సంతతికి చెందిన వ్యక్తి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఎవరు ?
ఎ) అమితాబ్ సూరి
బి) రాజీవ్ సూరి
సి) అమిత్ సూరి
డి) లలిత్ సూరి
జ: బి సరైనది
7) శ్రీలంక పార్లమెంటును ఆ దేశాధ్యక్షుడు రద్దు చేశారు. ఇంకా 6 నెలలు ఉండగానే పార్లమెంటును రద్దు చేశారు. 2020 ఏప్రిల్ 2న శ్రీలంకలో ఎన్నికలు జరగనున్నాయి. శ్రీలంక అధ్యక్షుడు ఎవరు ?
ఎ) గొతబయ రాజపక్స
బి) మహేంద్ర రాజపక్స
సి) మైత్రిపాల శిరిసేన
డి) రణిల్ విక్రమ సింఘే
జ: ఎ సరైనది
8) అమెరికాలో అత్యంత ప్రఖ్యాత, కార్పొరేట్ నాయకుల్లో ఒకడైన జాక్ వెల్ష్ బోస్టన్ లో చనిపోయారు. ఆయన ఏ కంపెనీకి అధిపతి ?
ఎ) వాల్ మార్ట్
బి) మెక్ కెస్సన్
సి) యునైటెడ్ హెల్త్ గ్రూప్
డి) జనరల్ ఎలక్ట్రికల్ (GE)
జ: డి సరైనది