04 FEB CURRENT AFFAIRS

జాతీయం
2) వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల ఒత్తిడి, ఆందోళనను దూరం చేసేందుకు ప్రధాని నరేంద్రమోడీ తన అనుభవాలతో 25 అధ్యాయాలు రాసిన పుస్తకం విడుదలైంది. దాని పేరేంటి
జ: ఎగ్జామ్ వారియర్స్
(నోట్: ఎగ్జామ్ వారియర్స్ పుస్తకాన్ని కేంద్రమంత్రులు జవదేకర్, సుష్మా స్వరాజ్ విడుదల చేశారు )
3) ఎయిర్ బస్ సంస్థ అభివృద్ది చేస్తున్న అత్యాధునిక విమానానికి సంస్కృతంలో పేరు పెట్టారు. దాని పేరేంటి ?
జ: వాహన
4) సైన్యంలో కృత్రిమ మేథో సంపదపై అధ్యయనం చేసేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ ఏది
జ: నటరాజన్ చంద్రశేఖరన్ టాస్క్ ఫోర్స్
5)వి.శాంతారామ్ జీవితకాల సాఫల్య అవార్డు 2018ను మరణానంతరం ఎవరికి ప్రకటించారు ?
జ: శ్యామ్ బెనగల్ ( సినీ దర్శకుడు, నిర్మాత)
6) నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ( NSG) కి కొత్త డైరక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు ;?
జ: సుదీప్ లఖ్టాకియా
7) 32వ సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా 2018 కు పార్టనర్ గా ఉన్న దేశం ఏది
జ: కిర్జిస్తాన్
8) ఆష్గాబాట్ ఒప్పందంలో చేరిన దేశం ఏది
జ: భారత్

9) 2018 సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ అవార్డును ఎవరికి ప్రకటించారు
జ: శేష్ ఆనంద్ మధుకర్
10) భారత సైన్యంలో మిలటరీ ఆపరేషన్స్ డైరక్టర్ జనరల్ ( DGMO) గా నియమితులైనది ఎవరు
జ: అనిల్ చౌహాన్
11) 2018 ఇండియా ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్ లో ఏ కేటగిరీలో మేరీ కామ్ బంగారు పతకాన్ని గెలుచుకున్నారు ?
జ: 48 కేజీల విభాగంలో
12) బనారస్ హిందూ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా ఎవరు నియమితులయ్యారు
జ: బీ ఏ ఛోపడే
13) అండర్ 19 ప్రపంచ కప్ ను భారత్ సొంతం చేసుకుంది. ఫైనల్లో ఏ జట్టుపై గెలిచారు
జ: ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో విజయం
14) అండర్ 19 జట్టుకు కెప్టెన్, కోచ్ ఎవరు

జ: పృధ్వీ షా, రాహుల్ ద్రవిడ్