05 FEB CURRENT AFFAIRS

జాతీయం
1) కేంద్ర ప్రభుత్వం రూపొందించిన యాక్ట్ ఈస్ట్ ( తూర్పు దేశాలతో కలసి నడిచే విధానం)ను ముందుకు తీసుకువెళ్లడంలో ఏ సంస్థ కీలక పాత్ర పోషించనుంది
జ: నీతి ఆయోగ్
2) గోమూత్రంతో ఎనిమిది రకాల మందులను తయారీకి ప్రోత్సాహం కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏది
జ: ఉత్తర్ ప్రదేశ్
3) జాతీయ గోకుల్ మిషన్ కింద పశు సంజీవని ప్రాజెక్టులో బాగంగా దేశంలో ఎన్ని కోట్ల ఆవులకు ఆధార్ లాంటి నెంబర్ ఇచ్చేందుకు కేంద్రం రూ.50కోట్లను కేటాయించింది
జ: 4 కోట్లు
4) ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న అమెరికా వైమానిక దళ అధిపతి ఎవరు ?
జ: జనరల్ డేవిడ్ ఎల్ గోల్డ్ ఫిన్
5) 24 గంటల్లో 980 విమానాల రాకపోకలతో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సింగిల్ రన్ వే విమానాశ్రయంగా వార్తల్లోకి ఎక్కిన ఎయిర్ పోర్ట్ ఏది ?
జ: ముంబైలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్

అంతర్జాతీయం
6) ప్రపంచంలోనే అత్యంత బుల్లి రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించిన దేశం ఏది
జ: జపాన్
(నోట్: పొడవు 10 మీటర్లు, వ్యాపం 53 సెంటీమీటర్లు. కగోషిమా ప్రిపెక్చర్ లోని ఉంచినోరా అంతరిక్ష కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించారు )
7) ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్ లో ఎన్ని నకిలీ ఖాతాలు ఉన్నట్టు ఆ సంస్థ ప్రకటించింది
జ: 20 కోట్లు