06 FEB CURRENT AFFAIRS

జాతీయం
1) ప్రధాని నరేంద్రమోడీ ఏయే పశ్చిమాసియా దేశాల్లో ఎప్పటి నుంచి పర్యటించనున్నారు ?
జ: ఫిబ్రవరి 9 నుంచి 12 వరకూ ( పాలస్తీనా, UAE, ఒమన్ )
2) నీతి ఆయోగ్ CEO పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ప్రస్తుతం ఈ పదవిలో ఎవరు కొనసాగుతున్నారు ?
జ: అమితాబ్ కాంత్ ( 2019 జూన్ 30 వరకూ పొడిగింపు)
3) సెప్టెంబర్ 2018 కల్లా దేశంలోని 1.55 లక్షల పోస్టాఫీసుల్లో పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సేవలను అందిస్తామని తపాలశాఖ ప్రకటించింది. 2015లో ఆర్బీఐ ఎన్ని సంస్థలకు పేమెంట్స్ బ్యాంక్ సేవలకు అనుమతి ఇచ్చింది
జ: 11 సంస్థలు
(నోట్: వీటిల్లో ఎయిర్ టెల్, పేటీఎం, పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులు మాత్రమే సేవల్ని ప్రారంభించాయి )
4) ఏ కోడి భౌగోళిక గుర్తింపు కోసం మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ మధ్య వివాదం నడుస్తోంది ?
జ: కడక్ నాథ్
5) బిజినెస్ మేగజైన్ ఫోర్బ్స్ లో ఇండియా 30 అండర్ 30లో చోటు దక్కించుకున్న నలుగురు ప్లేయర్స్ ఎవరు
జ: జస్ ప్రీత్ బుమ్రా, హర్మన్ ప్రీత్ కౌర్, సవితా పూనియా, హీనా సిద్ధూ

అంతర్జాతీయం
6) రాజకీయ సంక్షోభంతో ఏ దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు ?
జ: మాల్దీవులు ( అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్)