07 FEB CURRENT AFFAIRS

జాతీయం
1) అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన అగ్ని-1 క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఇది ఎన్ని కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు
జ: 700 కిమీ
2) అగ్ని - 1 క్షిపణి పరీక్ష ఎక్కడ జరిగింది ?
జ: ఒడిశా లోని అబ్దుల్ కలాం దీవి నుంచి
3) జైనులకు చెందిన 88వ మహా మస్తాభిషేక ఉత్సవాలు (బాహుబలి) ఎక్కడ జరుగుతున్నాయి
జ: శ్రవణ బెళగొళ ( కర్ణాటక)
4) పూర్తిగా భారతీయ పరిజ్ఞానంతో సూర్యుడిపై తొలి ప్రయోగం ఆదిత్య ఎల్ 1 ను ఎప్పుడు నిర్వహించనున్నారు ?
జ: 2021లో
5) హిస్ ఎక్స్ లెన్సీ అనే పదాన్ని సభలో ఉపయోగించవద్దని గౌరవనీయులైన ఛైర్మన్ అంటే చాలని సూచించినది ఎవరు
జ: రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

అంతర్జాతీయం
6) ఏ దేశంలో మొదలైన స్టాక్ మార్కెట్ల పతనం యూరప్, ఆసియా దేశాలకు కూడా విస్తరించింది ?
జ: అమెరికా
7)సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మరో జడ్జిని ఏ దేశంలో అరెస్ట్ చేశారు ?
జ: మాల్దీవుల్లో