08 FEB CURRENT AFFAIRS

ఆంధ్రప్రదేశ్
1) విజయవాడ నుంచి ఎయిర్ లైన్స్ సర్వీసులు నడపడానికి ముందుకు వచ్చిన ప్రైవేటు విమానయాన సంస్థ ఏది
జ: ఇండిగో
2) అమృతానంద మయి ట్రస్ట్ ఆధ్వర్యంలో అమరావతిలో ఏర్పాటు కాబోతున్న యూనివర్సిటీ పేరేంటి ?
జ: అమృత యూనివర్సిటీ
3) నెల్లూరులోని నాయుడమ్మ సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆల్టర్నేటివ్స్ సంస్థ ఏటా అందించే ప్రతిష్టాత్మక నాయుడమ్మ అవార్డును ఎవరికి ప్రకటించారు?
జ: ఆస్ట్రేలియాకి చెందిన ప్రొ.డాక్టర్ చెన్నుపాటి జగదీశ్

జాతీయం
4) కర్ణాటకలోని శ్రావణ బెళగొళలో కొలువుదీరిన గోమఠేశ్వరుని విగ్రహానికి 88వ మహామస్తాభిషేక కార్యక్రమాలను ఎవరు ప్రారంభించారు ?
జ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
5) దేశంలోనే ప్రైవేటు రంగంలో అతిపెద్ద విద్యుత్తు సరఫరా ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?
జ: ఉత్తర ప్రదేశ్
6) హిందూస్తాన్ ఏరో నాటిక్స్ సంస్థ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ( RTOS) ను బిగించిన విమానం విజయవంతంగా ఎగిరింది. ఆ విమానం పేరేంటి ?
జ: హక్ విమానం
7) స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన పృథ్వీ-2 క్షిపణిని శాస్త్రవేత్తలు ఒడిశాలోని చాందీపూర్ ITR నుంచి విజయవంతంగా ప్రయోగించారు. ఇది ఎన్ని కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు
జ: 350 కిమీ
(నోట్: 500 నుంచి వెయ్యి కిలోల బరువున్న అణఉ వార్ హెడ్స్ మోసుకెళ్లగలదు)

అంతర్జాతీయం
8) హెవీ పేలోడ్స్ మోసుకెళ్ళే రాకెట్ లో టెస్లా కంపెనీ కారును అంతరిక్షంలోకి పంపిన అమెరికాకి చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ ఏది ?
జ: స్పేస్ ఎక్స్
09) జన సమూహంలో నక్కిన నేరగాళ్లని పసిగట్టే హైటెక్ కళ్ళద్దాలను ఏ దేశం అభివృద్ది చేసింది ?
జ: చైనా
10) బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా ఎవరు మరోసారి ఎన్నికయ్యారు ?
జ: అబ్దుల్ హమీద్