1184 పోస్టులతో ఆగస్టులో నోటిఫికేషన్

1184 పోస్టులతో ఆగస్టులో నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ లో కొత్త పోస్టుల నోటిఫికేషన్ కు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు నెలలో 1184 పోస్టులతో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని APPSC ప్రకటించింది. ఇందులో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు కూడా ఉన్నట్టు సమాచారం. ఈ నోటిఫికేషన్ నుంచే EWS రిజర్వేషన్లు అమలవుతాయని అధికారులు తెలిపారు. అంతేకాకుండా... గ్రూప్ 1 తప్ప... APPSC నిర్వహించే ఏ పరీక్షకు అయినా ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఉండదు. ప్రిలిమ్స్ రద్దు చేస్తున్నట్టు APPSC ప్రకటించింది.