14 MARCH 2020 CURRENT AFFAIRS QUIZ (AP)

AP
1) ఏపీలో 33 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఎన్ని చిన్న జల విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
ఎ) 33
బి) 24
సి) 26
డి) 29
జ: డి సరైనది
NATIONAL
2) నాలుగు రాష్ట్రాల గుండా 780 కిలో మీటర్ల దూరం నిర్మించే గ్రీన్ హైవేకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిక కోసం రూ.7660 కోట్లు ఖర్చు చేయనున్నట్టు మంత్రి జవదేకర్ తెలిపారు. ఈ గ్రీన్ హైవే ఈ కింద ఏయే రాష్ట్రాల గుండా వెళ్తుంది ?
ఎ) హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా
బి) రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఒడిశా
సి) హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, యూనీ, ఏపీ
డి) హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ
జ: సి సరైనది
3) ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum ) ఇటీవల విడుదల చేసిన 115 మంది యంగ్ గ్లోబల్ లీడర్స్ లో మన దేశానికి చెందిన ఎంతమంది పేర్లు ఉన్నాయి ?
ఎ) ఇద్దరు
బి) ఐదుగురు
సి) పది మంది
డి) ముగ్గురు
జ: బి సరైనది
4) ఇటీవల ఏ ఇండియన్ పారా మిలటరీ బలగాలకు ఎస్.ఎస్. దేశ్వాల్ డైరక్టర్ జనరల్ (DG) గా నియమితులయ్యారు ?
ఎ) బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
బి) సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్
సి) సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్
డి) నేషనల్ సెక్యూరిటీ గార్డ్
జ: ఎ సరైనది
5) 2020 ఆరో ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఈసారి నేషనల్ ఈవెంట్ ను ఎక్కడ నిర్వహించనున్నారు ? ( ఇక్కడ జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొంటారు )
ఎ) లేహ్
బి) రాంచీ
సి) న్యూఢిల్లీ
డి) గౌహతి
జ: ఎ సరైనది
6) దేశంలో పెరుగుతున్న విమాన ప్రయాణీకులకు తగ్గట్టుగా విమానాశ్రయాల సామర్థ్యాన్ని పెంచేందుకు 30 కోట్ల డాలర్ల విదేశీ రుణం తీసుకుంటున్నట్టు ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ తెలిపారు. ఆయన పేరేంటి ?
ఎ) రాజీవ్ చౌహాన్
బి) అర్వింద్ సింగ్
సి) అర్వింద్ దయాళ్
డి) రాఘవేంద్ర సింగ్
జ: బి సరైనది
7) 86 యేళ్ళ సుదీర్ఘ చరిత్ర కలిగిన రంజీ ట్రోఫీ టైటిల్ ను మొదటిసారి దక్కించుకున్న జట్టు ఏది ?
ఎ) పశ్చిమబెంగాల్
బి) తమిళనాడు
సి) సౌరాష్ట్ర
డి) కర్ణాటక
జ: సి సరైనది
(నోట్: మహారాజ్ రంజిత్ సిన్హ్ జీపేరుతోనే ఈ టోర్నీ స్టార్ట్ అయినా ఒక్కసారి కూడా సౌరాష్ట్రకి ఈ ట్రోఫీ దక్కలేదు )
INTERNATIONAL
8) గ్రీస్ మొదటి మహిళా అధ్యక్షురాలిగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి 2020 మార్చి 13న ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె పేరేంటి ?
ఎ) గోల్డా మేయర్
బి)లిడియా గూలియర్
సి) ఇసాబెల్ మార్టినెజ్
డి) కెటరీనా సకెల్లార్ పౌలూ
జ: డి సరైనది
9) కోవిడ్ 19 ( కరోనా వైరస్ ) అనుమానిత కేసులను మూడున్నర గంటల్లో రోగ నిర్ధారణ చేసేందుకు కొత్త పరీక్షా విధానాన్ని ఏ దేశానికి చెందిన సంస్థ రోష్ ప్రకటించింది ?
ఎ) స్విట్జర్లాండ్
బి) జర్మనీ
సి) చైనా
డి) అమెరికా
జ: ఎ సరైనది
10) స్టాక్ హోమ్ ఇంటర్నేషన్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ విడుదల చేసన కొత్త జాబితా ప్రకారం గడచిన ఐదేళ్ళల్లో ప్రపంచంలో ఆయుధాలను ఎక్కువగా ఎగుమతి చేసిన దేశం ఏది ?
ఎ) రష్యా
బి) ఫ్రాన్స్
సి)అమెరికా
డి) చైనా
జ: సి సరైనది
11) కోవిడ్ 19 వైరస్ కోసం కోవిడ్ యాక్షన్ ప్లాట్ ఫామ్ పేరుతో వ్యాపారవేత్తల కమ్యూనిటీని ఏర్పాటు చేసిన సంస్థ ఏది ?
ఎ) వరల్డ్ బ్యాంక్
బి) వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్
సి) ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్
డి) ఐక్య రాజ్య సమితి
జ: బి సరైనది
13) ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) కోవిడ్ 19 ని అంతర్జాతీయ మహమ్మారిగా డిక్లేర్ చేసింది. ఇంతకుముందు ఏ అంటువ్యాధిని ఇలా డిక్లేర్ చేశారు.
ఎ) HIV
బి) Swine Flu
సి) Spanish Flu
డి) H1N1 Influenza
జ: డి సరైనది