15 JAN CURRENT AFFAIRS

ఆంధ్రప్రదేశ్
1) సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఫిబ్రవరి 1 నుంచి మొదలయ్యే టెలీ ఆప్తమాలజీ పథకానికి ఏమని పేరు పెట్టారు ?
జ: ముఖ్యమంత్రి ఎలక్ట్రానిక్ ఐ కేంద్రం ( CM E-EYE)
(NOTE: రాష్ట్రంలోని 121 PHC ల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు )
2) ఏపీజే అబ్దుల్ కలాం సెంటర్ అందించే ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ అవార్డుకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎవరు ?
జ: నారా లోకేష్
3) రాష్ట్రంలోని రైతులకు మొత్తం ఎన్ని ఇంధన పొదుపు పంపు సెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు
జ: 15 లక్షలు
4) జపాన్ సర్కార్ యేటా నిర్వహించే షిప్ ఫర్ వరల్డ్ యూత్ లీడర్స్ కార్యక్రమానికి వెళ్లే భారత్ బృందానికి నాయకత్వం వహిస్తున్న తెలుగు అమ్మాయి ఎవరు ?
జ: శ్రీతేజ
5) శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో మూత్రపిండాల వ్యాధి ప్రబలడానికి కారణాలపై పరిశోధనలకు ఇండియన్ కౌన్సెల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి ఎక్కడ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది ?
జ: విశాఖలోని స్విమ్స్ లో

జాతీయం
5) ఆరు రోజుల భారత్ పర్యటనకు వచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని ఎవరు ?
జ: బెంజిమన్ నెతన్యాహు
(నోట్: 15 యేళ్ళ తర్వాత భారత్ లో పర్యటిస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని)
6) ఢిల్లీలోని తీన్ మూర్తి చౌక్ పేరును ఏ విధంగా మార్చారు ?
జ: తీన్ మూర్తి హైఫా చౌక్
7) ఏ ప్రముఖ శాస్త్రవేత్త స్వీయ చరిత్రలోని అంశాలను ఇంగ్లీష్ పాఠ్య పుస్తకాల్లో పాఠ్యాంశాలుగా చేర్చాలని SSC, HSC బోర్డులు భావిస్తున్నాయి ?
జ: భారతరత్న అబ్దుల్ కలామ్
8) చట్టవిరుద్ధంగా తమ దేశంలో నివసించే వారిని వెనక్కి పంపేందుకు ఉద్దేశించిన కీలక ఒప్పందాలపై... ఏ దేశంతో భారత్ సంతకం చేసింది ?
జ: బ్రిటన్( ఇంగ్లాండ్)
9) విద్యాహక్కు చట్టంలోకి 6 యేళ్ల లోపు పిల్లలను కూడా తీసుకురావాలని సెంట్రల్ అడ్వయిజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (కేబ్) నిర్ణయించింది. అయితే ఇప్పటి వరకూ ఎన్నేళ్ళ లోపు `పిల్లలను ఈ హక్కు పరిధిలోకి చేర్చారు ?
జ: 6-14 యేళ్ళ లోపు పిల్లలు
10) ప్రపంచ తయారీ రంగ సూచీలో భారత్ కు ఎన్నో స్థానం లభించినట్టు ప్రపంచ ఆర్థిక సమాఖ్య (WEF) ప్రకటించింది ?
జ: 30వ స్థానం
11) NSCDEX కమోడిటీస్ మార్కెట్లో చోటు దక్కించుకున్న కూరగాయల గింజలు ఏవి ?
జ: జిగురు ఇచ్చే గోరు చిక్కుడు ( గౌర్ సీడ్ /క్లస్టర్ బీన్స్)
12) ఫింగర్ ప్రింట్స్, ఫేస్ ఐడీలతో తమ యాప్ ను లాగిన్ అయ్యే సౌకర్యం కల్పించిన బ్యాంక్ ఏది ?
జ: కొటక్ బ్యాక్
13) హిమాచల్ ప్రదేశ్ లో ఆరోగ్య కార్యకర్తగా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO) 2018 కేలండర్ పై చోటు దక్కించుకున్న భారతీయురాలు ఎవరు ?
జ: గీతా వర్మ ( కర్సోగ్ తహసీల్ గ్రామం)
14) పర్యావరణ రహితంగా పండగలు చేసుకునేకుందుకు కేరళలో ఏ మిషన్ ను అమలు చేస్తున్నారు ?
జ: సుచిత్వ మిషన్
15) హిమాచల్ ప్రదేశ్ తో జరిగిన ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో 32 బంతుల్లోనే సెంచరీ సాధించిన ఢిల్లీ యువ బ్యాట్స్ మన్ ఎవరు ?
జ: రిషబ్ పంత్
(నోట్: ఏ ఫార్మాట్ లో అయినా భారత్ తరపున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ)
16) వివాదస్పదమైన పద్మావత్ సినిమా ఎట్టకేలకు ఈనెల 25న రిలీజ్ అవుతోంది. దీనికి దర్శకుడు ఎవరు ?
జ: సంజయ్ లీలా బన్సాలీ

 

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, అభ్యర్థుల కోసం ఈ కింది వాట్సాప్, టెలిగ్రాం, ఫేస్ బుక్ ఖాతాలను ఓపెన్ చేశాం. జాయిన్ అవగలరు.

1) AP TRT&TET (Whatsapp)
https://chat.whatsapp.com/9fIgnM2qIwDF9xjjvyHQjP

2) ANDHRAEXAMS.COM (Whatsapp)
https://chat.whatsapp.com/Dx8wlXbujoo8V9RxX6ZbMx

3) AP TRT & TET ( TELEGRAM)
https://t.me/joinchat/GPhsigzvdsrqGJnUDu2KQg

4) ANDHRA EXAMS (FACE BOOK PAGE)
https://www.facebook.com/Andhra-exams-180377329217436/