16, 17 JAN CURRENT AFFAIRS

రాష్ట్రీయం

1) దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 20న వెళ్తున్నారు. ఇక్కడ ఏ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక లాంజ్ ఏర్పాటవుతోంది ?
జ: రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి మండలి
2) 16 ఐటీ కంపెనీల ప్రారంభంతో మైటెక్ సిటీగా ఏ నగరం అభివృద్ధి చెందనుంది ?
జ: మంగళగిరి
3) గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ కు దేశంలో ఎన్నో స్థానం లభించింది ?
జ: రెండో స్థానం (మొదటిది తమిళనాడు, మూడోది: తెలంగాణ)
4) పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ కు ఎన్నో స్థానం వచ్చినట్టు కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది ?
జ: ఐదో స్థానం
5) ఆంధ్రప్రదేశ్ లో మొదటి, రెండు దశల్లో ఆకర్షణీయ నగరాలుగా కేంద్ర ప్రభుత్వం వేటిని ఎంపిక చేసింది
జ: విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి ; రెండో దశలో: అమరావతి
6) మొదటి విడతలో ఎంపికైన మూడునగరాల్లో ఒక్కోదానికి ఎంత మొత్తం నిధులను కేంద్రం కేటాయించింది ?
జ: ఒక్కో నగరానికి రూ.200 కోట్లు
7) ఏపీలో సంక్రాంతి సందర్భంగా పశువుల పరుష పందేలు ఎక్కడ జరిగాయి ?
జ: రంగంపేట (చిత్తూరు జిల్లా)
8) రాష్ట్రంలో ఏ శాఖ అందిస్తున్న సేవల్లో నాణ్యతకు స్విట్జర్లాండ్ కు చెందిన అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల గుర్తింపు సంస్థ గ్లోబల్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ సంస్థ అవార్డు లభించింది ?
జ: రెవెన్యూ శాఖ
9) తక్కువ నాణ్యత కలిగిన బైరటీస్ ని అధిక నాణ్యతగా మార్చగలిగే (బెనెఫిసియేషన్ ప్రక్రియ) కర్మాగారాన్ని రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేసేందుకు నీతి ఆయోగ్ ఆమోదం తెలిపింది ?
జ: మంగంపేట
10) ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సహాయక చర్యల్లో పాల్గొనేందుకు యువతకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీళ్ళని ఏమని పిలుస్తారు ?
జ: ఆపద మిత్ర

11) ఏపీలోని విశాఖలో ఎవరి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా పారిశ్రామికవేత్తల సదస్సు జరుగుతోంది ?
జ: ఎలీప్, దక్షిణాసియా మహిళాభివృద్ధి సంస్థలు

జాతీయం
12) వ్యాపారాపేక్షత, సాంకేతిక పరిజ్నాన కేంద్రం ( International Centre for Entreanupership and Technology - I CREATE ) ను భారత, ఇజ్రాయెల్ ప్రధానులు మోడీ, నెతన్యాహు ఎక్కడ ప్రారంభించారు ?
జ: గుజరాత్ అహ్మదాబాద్ దగ్గరల్లోని దేవ్ ధోలెర గ్రామంలో
13) వైమానిక దళ యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి మహిళా రక్షణ శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించారు. ఆమె ప్రయాణించిన విమానం ఏది ?
జ: సుఖోయ్ 30 MKI
(NOTE: ఈ విమానంలో విహరించిన మొదటి మహిళ 2009లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్)
14) హజ్ యాత్రకు సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది.  సబ్సిడీ రద్దు చేయాలని 2012లో సుప్రీంకోర్టు ఎప్పటి వరకూ డెడ్ లైన్ విధించింది ?
జ: 2022 నాటికి
15) ఆధార్ ధృవీకరణ కోసం ఫేస్ రికగ్నిషన్ ఉపయోగించేకునేలా UIDAI మార్పులు తెస్తోంది. ఈ విధానం ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది ?
జ: జులై 1
16) 2016 కు సంబంధించి ఐదు విభాగాల్లో సంగీత నాటక అకాడమీ అవార్డులను ఢిల్లీలో ఎవరు ప్రదానం చేశారు ?
జ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
17) ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ రూ.4,400కోట్లతో ఎమ్ అండ్ జీ ప్రుడెన్షియల్ సంస్థ నుంచి భారీ కాంట్రాక్ట్ దక్కించుకుంది.  ఈ సంస్థ ఎక్కడ వ్యాపారం చేస్తోంది ?
జ: యూకే, యూరప్ దేశాల్లో
18) భారత్ లో సొంతంగా వర్చువల్ కరెన్సీని (క్రిప్టో కరెన్సీ)ని తయారు చేసుకోవాలని నిర్ణయించిన బడా కంపెనీ ఏది ?
జ: రిలయన్స్ జియో
19) టూ వీలర్స్ కి కూడా నావిగేషన్ ఏర్పాటు చేసేందుకు ద్విచక్ర వాహన కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏది ?
జ: మ్యాప్ మై ఇండియా టెక్నాలజీ

అంతర్జాతీయం
20) పొగ మంచు, వాయు కాలుష్య నివారణ కోసం ప్రపంచంలోనే అతిపెద్ద వాయు శుద్ది పరికరాన్ని ఎక్కడ నిర్మించారు ?
జ: గ్జియాన్ ( చైనా)

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, అభ్యర్థుల కోసం ఈ కింది వాట్సాప్, టెలిగ్రాం, ఫేస్ బుక్ ఖాతాలను ఓపెన్ చేశాం. జాయిన్ అవగలరు.

1) AP TRT&TET (Whatsapp)
https://chat.whatsapp.com/9fIgnM2qIwDF9xjjvyHQjP

2) ANDHRAEXAMS.COM (Whatsapp)
https://chat.whatsapp.com/Dx8wlXbujoo8V9RxX6ZbMx

3) AP TRT & TET ( TELEGRAM)
https://t.me/joinchat/GPhsigzvdsrqGJnUDu2KQg

4) ANDHRA EXAMS (FACE BOOK PAGE)
https://www.facebook.com/Andhra-exams-180377329217436/