16 SEPT CA QUIZ

16 SEPT CA QUIZ

60 రోజుల RRB మాక్, గ్రాండ్ టెస్టులు, E-Notes, గైడెన్స్

RRB ఆన్ లైన్ కోచింగ్ + TEST SERIES డిటైల్స్ కోసం క్లిక్ చేయండి

https://andhraexams.com/rrb-mock-grand-tests-from-oct-2nd/

1. 2020 సెప్టెంబర్ నెలలో ప్రధాని నరేంద్రమోడీ ఏ రాష్ట్రంలో పట్టణ మౌలిక వసతులకి సంబంధించిన 6 ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు ?

2. దేశంలో e-Sanjeevani ( ఈసంజీవని) పేరుతో ఎన్ని రాష్ట్రాలు టెలీ మెడిసన్ సర్వీసును అమలు చేస్తున్నాయి ?

3. ప్రగతి, సాక్ష్యం కింద ఏ రాష్ట్ర విద్యార్థులకి ఇచ్చే స్కాలర్షిప్స్ ను కేంద్ర ప్రభుత్వం గతం కంటే  పెంచింది ?

4. A World in Disorder పేరుతో  రిపోర్ట్ ను విడుదల చేసిన Global Preparedness Monitoring Board ( GPMB) ఈ కింది వాటిల్లో దేనికి సంబంధించిన సంస్థ ?

1) World Bank

2) World Health Organization

3) International Monetary Fund

4) Asian Development Bank

5. వారెంట్లు, న్యాయస్థానం నుంచి ఆదేశాలు, FIR లాంటివి లేకుండా నేరుగా ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారాన్ని పోలీసులు కల్పించే వివాదస్పద నిర్ణయాన్ని తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏది ? ( ఫీజులు చెల్లిస్తే ప్రైవేటు వారికీ పోలీస్ సేవలు అందించనున్నారు )

6. రాజేష్ ఖుల్లార్ ఏ సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమితులయ్యారు ?

7. 2020-21 సంవత్సరానికి భారత్ వృద్ధి రేటు ఎంత శాతానికి క్షీణిస్తుందని ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ (ADB) అంచనా వేసింది ?

8. ప్రతి యేటా శాస్త్ర, సాంకేతిక రంగాలతో పాటు వాణిజ్య అంశాల్లో హిందీలో రాసే రెండు పుస్తకాలకు రాజ్ భాషా గౌరవ్ పురస్కార్ పేరుతో అవార్డులు ఇవ్వాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థ ఏది ?

9. భారత్ లో అత్యంత ప్రజాదరణ ఉన్న టిక్ టాక్ ను నిషేధించడంతో అలాంటి తరహాలోనే సోషల్ మీడియా దిగ్జజం యూట్యూబ్ ఏ పేరుతో కొత్త యాప్ ను తీసుకొస్తోంది ?

10. దక్షిణాది రాష్ట్రాల్లో గోదావరి – కావేరి నదుల అనుసంధానానికి 2020 సెప్టెంబర్ 18న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్, తమిళనాడు రాష్ట్రాలతో చర్చించాలని జాతీయ జల అభివృద్ధి సంస్థ ( NWDA) నిర్ణయించింది.  అయితే ఈ ప్రతిపాదిత పథకానికి ఎన్ని TMC ల నీళ్ళు అవసరమని NWDA చెబుతోంది ?