1st నవంబర్ కరెంట్ ఎఫైర్స్

1st నవంబర్ కరెంట్ ఎఫైర్స్

ఈలా భట్ కన్నుమూత

 • ప్రముఖ మహిళాహక్కుల నాయకురాలు, 'Self Employee Women’s Associationసెల్ఫ్ (SEWA) వ్యవస్థాపకురాలు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఈలాభట్ (89) 2022 నవంబర్ 2న కన్నుమూశారు.
 • 50యేళ్ళ పాటు న్యాయవాదిగా జీవితం ప్రారంభించారు.
 • మహిళా సాధికారతకు పనిచేయడంతో అంతర్జాతీయ గుర్తింపు పొందారు.
 • 1933లో అహ్మదాబాద్ లో పుట్టిన ఈలాభట్ మహాత్ముడి ఆశయాలతో స్ఫూర్తి పొందారు.
 • అసంఘటిత రంగ మహిళల హక్కుల కోసం స్థాపించిన 'సేవా' సంస్థలో 20 లక్షల మంది సభ్యులు ఉన్నారు.
 • స్థానిక 'గుజరాత్ విద్యాపీఠ్ విశ్వవిద్యాలయ ఛాన్స్ లర్ గా నెల రోజుల కిందటి దాకా పనిచేసి, అనారోగ్యం. కారణంగా రాజీనామా చేశారు.
 • రాజ్యసభకు నామినేటెడ్ సభ్యురాలిగా ఎంపికై ప్రణాళికా సంఘంలోనూ సేవలందించారు.
 • ఈలాభట్ రామన్ మెగసెసె, రైట్ లైవ్లీహుడ్, నివానో పీస్ ప్రైజ్, ఇంది రాగాంధీ శాంతి బహుమతులు అందుకున్నారు

 

RAF కు మొదటిసారిగా మహిళా IG అధికారులు

 • CRPF చరిత్రలో మొదటిసారిగా బిహార్ లోని RAF (అల్లర్ల నిరోధక దళం) విభాగానికి ఇన్ స్పెక్టర్స్ జనరల్ (ఐజీ)గా ఇద్దరు మహిళా అధికారులను నియమించారు.
 • 25 లక్షల మందితో అతి పెద్ద పారా మిలటరీ అయిన CRPFలో మహిళలను మొదటిసారిగా 1987లో అనుమతి కల్పించారు.
 • 35 ఏళ్ల తరువాత వారు IGలుగా ఉన్నత స్థానంలో నియమితులయ్యారు. ప్రస్తుతం CRPF విభాగాలకు మహిళా IPS అధికారులు నేతృత్వం వహిస్తున్నారు. ముగ్గురు పని చేస్తున్నారు.

పెట్రోల్ లో ఇథనాల్ శాతం పెంపు

 • పెట్రోల్ దిగుమతుల కోసం విదేశాలపై అతిగా ఆధార పడకుండా కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
 • ప్రస్తుతం లీటరుకు 10% ఇధనాల్ ను కలుపుతుండగా... 2025-28 నాటికి ఈ మిశ్రమాన్ని 20 శాతానికి పెంచాలని నిర్ణయించింది.
 • వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల దగ్గర 20% ఇథనాల్ తో ఉన్న పెట్రోల్ ను అందుబాటులోకి తెస్తారు.
 • అసలు 2022 నవంబరు నాటికే పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమం 10% ఉండేలా చూడాలి. అయితే 2022 జూన్ నాటికే ఈ లక్ష్యం చేరుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

రూ.23,220 కోట్లు పెరిగిన ఎరువుల రాయితీ

 • రబీ సీజన్లో మొత్తం రూ.51,875 కోట్ల సబ్సిడీ ఇవ్వాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.
 • ఈ ఏడాది రబీ సీజన్ లో (అక్టోబరు 1, 2022 నుంచి మార్చి 31, 2023 వరకూ) ఎరువులపై రూ.51,875 కోట్ల రాయితీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
 • గత ఏడాది కంటే ఇది రూ. 23,220 కోట్లు ఎక్కువ. నత్రజనికి కిలోకు రూ.98,02, పాస్పరస్ కు రూ.83, పొటాష్ కు రూ.23.65, సల్ఫర్ కు రూ.6.12 సబ్సిడీ ఇస్తారు.
 • ఈ రబీలో దేశంలో తయారయ్యే ఎరువుల రవాణా సబ్సిడీ కలిపి మొత్తం రూ. 875 కోట్ల రాయితీ భారం కేంద్రం భరించనుంది.
 • వ్యవసాయ ఖర్చులను అదుపులో ఉంచాలన్న ఆలోచనతో ఎరువుల సబ్సిడీని ప్రభుత్వం 2010, ఏప్రిల్ 1 నుంచి పోషకాధారిత రాయితీ పథకం కింద అందిస్తోంది.
 • అంతర్జాతీయ మార్కెట్లో ఎరువులు, వాటి ముడిసరకుల ధరలు విపరీతంగా పెరగడంతో DAP, P & K ఎరువులపై సబ్సిడీ భారం పెరిగినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.