20 FEB CURRENT AFFAIRS QUIZ ( AP & TS )

01) నేషనల్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక బ్రీడ్స్ గా జాతీయ స్థాయి గుర్తింపునిస్తూ ప్రకటించిన జాబితాకి సంబంధించి ఈ కింది వాటిల్లో ఏ ప్రకటన సరైనది ?

ఎ) తెలంగాణలోని నాగర్ కర్నూల్ కి చెందిన జాతి పశువు పొడ తురుపు ఆవుకి గుర్తింపు వచ్చింది

బి) పొడ తురుపు ఆవులు, ఎడ్లు నాగర్ కర్నూల్ జిల్లాలో ఉండే అరుదైన జాతి

సి) రాష్ట్రానికి చెందిన వనరాజా జాతి కోడికి జాతీయ గుర్తింపు లభించింది. ఈ కోళ్ళని హైదరాబాద్ లోని ICAR ఫౌల్ట్రీ రీసెర్చ్ సెంటర్ అభివృద్ధి చేసింది

డి) దేశవ్యాప్తంగా కొత్తగా 13 జంతువులు, ఒక పౌల్ట్రీ జాతికి గుర్తింపు ఇస్తూ నేషనల్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ జాబితా విడుదల చేసింది

1)  ఎ,బి,సి సరైనవి

2) అన్నీ సరైనవి

3) ఎ,బి,డి సరైనవి

4) బి,సి,డి సరైనవి

జ: 2 అన్నీ సరైనవి

02) హైదరాబాద్ HICC లో టుడే ఫర్ టుమారో థీమ్ తో  జరిగిన 17వ బయో ఏషియా సదస్సు 2020 ఫిబ్రవరి 19తో ముగిసింది.  ఈ సదస్సులో ఎన్ని దేశాలకు చెందొన 2100 మంది ప్రతినిధులు పాల్గొన్నారు ?

1) 37 దేశాలు

2) 50 దేశాలు

3) 49 దేశాలు

4) 185 దేశాలు

జ: 1 సరైనది ( 37 దేశాలు )

03) 2019లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఇంపార్టెంట్ ఈవెంట్స్, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఇండియా 2020 ఇయర్ బుక్ ను న్యూఢిల్లీలో ఎవరు ఆవిష్కరించారు ?

1) ప్రధాని నరేంద్రమోడీ

2) ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

3) I & B మినిస్టర్ ప్రకాష్ జవదేకర్

4) రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

జ: 3 సరైనది ( I & B మినిస్టర్ ప్రకాష్ జవదేకర్ )

04) చీఫ్ విజిలెన్స్ కమిషనర్ ( CVC) గా ఎవరు నియమితులయ్యారు ?

1) బిమల్ జుల్కా

2) సంజయ్ కొఠారి

3) అనితా పాండోవె

4) రాజివ్ గుబా

జ: 2 సరైనది ( సంజయ్ కొఠారి )

05) అయోధ్యలో రాముడి గుడి కట్టేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అధిపతిగా ఎవరు నియమితులయ్యారు ?

1) మహంత్ నిత్య గోపాల్ దాస్

2) కె.పరాశరన్

3) చంపత్ రాయ్

4) గోవింద్ గిరి

జ: 1 సరైనది (మహంత్ నిత్య గోపాల్ దాస్ )

06) టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ( THE) ఎమర్జింగ్ ఎకానమీస్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2020లో టాప్ 100లో భారత్ లో టాప్ యూనివర్సిటీగా నిలిచిన సంస్థ ఏది ?

1) IIT ఖరగ్ పూర్

2) IIT ఢిల్లీ

3) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్

4) IIT మద్రాస్

జ: 3 సరైనది (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ )

07) నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మంట్ (నాబార్డ్ ) ఛైర్మన్ గా ఎంపికైన గుంటూరు జిల్లాకి చెందిన తెలుగువారు ఎవరు ?

1) గోవిందరాజులు చింతల

2) విశ్వనాథం కోడూరు

3) గోవింద్ నల్లను చక్రవర్తులు

4) బసివి రెడ్డి అనిమిరెడ్డి

జ: 1 సరైనవి (గోవిందరాజులు చింతల )

08) 2020 ఫిబ్రవరి 20నాడు న్యూఢిల్లీలోని రాజ్ పథ్ లో జరుగుతున్న ఏ మేళాను ప్రధాని నరేంద్రమోడీ ఆకస్మికంగా సందర్శించారు ?

1) ఇన్ స్పైర్

2) నుమాయిష్, ఢిల్లీ

3) వీటిల్లో ఏదీ కాదు

4) హూనర్ హాట్

జ: 4 సరైనది ( హూనర్ హాట్ )

09) ఆంధ్రప్రదేశ్ లో 2020 మార్చి 25 ఉగాది కల్లా 25 లక్షల మందికి ఇళ్ళ స్థలాల పట్టాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ఐదేళ్ళల్లో వీళ్ళందరికీ ఇంటి నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్ణయించింది.  అయితే 2020-21 లో గృహ నిర్మాణాల రుణ అంచనా రూ.13,411 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయించిన బ్యాంక్ ఏది ?

1) SBI

2) ICICI

3) HDFC

4) NABARD

జ: 4 సరైనది ( NABARD )

10)  దేశంలో 2023 నాటికి ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 90.7 కోట్లకు చేరుతుందని సిస్కో సంస్థ తెలిపింది. అయితే ఈ సంఖ్య జనాభాలో ఎంత శాతం ?

1) 64శాతం

2) 34 శాతం

3) 74 శాతం

4) 84 శాతం

జ: 1 సరైనది (64 శాతం )