Wednesday, October 23

2018 FEB TOP CURRENT AFFAIRS -2

01) 2018 ఫిబ్రవరిలో కావేరీ నదీ జలాల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది.  కర్ణాటకకు ఎన్ని టీఎంసీలను కేటాయించింది ?
జ: 284.75
(నోట్: తమిళనాడుకి 404.25 టీఎంసీలు, కేరళ: 30 టీఎంసీలు, పుదుచ్చేరి 7 టీఎంసీలు)
02) కృత్రిమ మేథ అభివృద్ధి కోసం మొదటిసారిగా ఇనిస్టిట్యూట్ ను ఏర్పాటుచేసిన రాష్ట్రం ఏది ?
జ: మహారాష్ట్ర (ముంబైలో )
03) రాష్ట్రంలో మనిషి జీవిత కాలం ఎంత వరకూ పెరిగినట్టు భారత వైద్య పరిశోధనా మండలి స్టడీలో తేలింది
జ: పురుషులు : 69.4 యేళ్ళు, స్త్రీలు 73.2 యేళ్ళు
04) దేశంలోనే మొదటిసారిగా మ్యాన్ హోల్స్ ను శుభ్రం చేసేందుకు రోబోలను వాడాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: కేరళ
(నోట్: బ్యాండికూట్ అనే రోబోను జెన్ రోబోటిక్స్ సంస్థ తయారు చేసింది )
05) హైదరాబాద్ లో జరిగిన ప్రపంచ ఐటీ సదస్సులో మాట్లాడిన తొలి మానవ రూప రోబో (హ్యూమనాయిడ్) ఏది ?
జ: సోఫియా
( ఈ రోబో సృష్టికర్త : డేవిడ్ హాన్సన్ )
06) నదీజలాల విషయంలో తీవ్రమైన జాప్యం జరుగుతున్నందున ఒకే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ డిక్లరేషన్ కు ఏమని పేరు పెట్టారు ?
జ: హైదరాబాద్ డిక్లరేషన్
07) 2018 ఫిబ్రవరిలో  అణ్వస్త్ర సామర్థ్యమున్న మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-2 ను ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి విజయవంతంగా పరీక్షించారు. ఇది ఎన్ని కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగలదు ?
జ: 2 వేల కిమీ
08) కామన్ వెల్త్ యువ అవార్డుకి ఎంపికైన యోగేశ్ కుమార్ వాహనాలు నడపడానికి డ్రైవర్లుగా మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. ఆయన స్థాపించిన సామాజిక కంపెనీ ఏది ?
జ: ఈవెన్ కార్గో
09) ఉద్యోగుల భవిష్యనిధిపై వడ్డీ రేటును 2017-18 కు ఎంతగా నిర్ణయించారు ?
జ: 8.55 శాతం
10) వినియోగదారులకు బ్యాంకింగ్ కు సంబంధించిన ప్రాథమిక ప్రశ్నలపై సమాధానాలు ఇచ్చేందుకు RBS బ్యాంకు ఏర్పాటు చేసిన డిజిటల్ మానవ రూపం నమూనాని విడుదల చేశారు. ఆ రూపానికి ఏమని పేరు పెట్టారు ?
జ: కోరా
11) రాత్రివేళల్లోనూ లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకునేలా రూపొందించిన క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు. దాని పేరేంటి ?
జ: పృధ్వీ - 2
12) నవజాతి శిశువులకు అత్యంత సురక్షితమైన దేశం ఏది ?
జ: జపాన్
13) బాంబే స్టాక్ ఎక్చేంజ్ లో GHMC అధికారికంగా లిస్టింగ్ అయింది. బాండ్ల ద్వారా ఎన్ని కోట్లు సమీకరించాలని నిర్ణయించారు ?
జ: 200 కోట్లు
(నోట్: మొత్తం వెయ్యి కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు )
14) ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం ప్రపంచ అవినీతి సూచీ - 2017 లో ఇండియా స్థానం ఎంత ?
జ: 81
(నోట్: మొత్తం 180 దేశాలకు ర్యాంకులు కేటాయించారు )
15) భారత్ లో స్థూల జాతీయోత్పత్తి ( GDP) లో కుబేరుల వాటా ఎంతకు పెరుగుతోందని ఆక్స్ ఫామ్ ఇండియా నివేదిక వెల్లడించింది ?
జ: 15శాతం
16) 2014 జనవరి 1 నుంచి 2017 మార్చి 31 వరకూ చేనేత కార్మికులు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎంతమొత్తాన్ని మాఫీ చేస్తారు ?
జ: లక్ష రుణం (వృత్తి పరమైన అవసరాల కోసం తీసుకున్నవి మాత్రమే )
17) ఏపీ నెల్లూరు జిల్లాలోని ఏ ఓడరేవును అధీకృత ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ?
జ: కృష్ణ పట్నం ఓడరేవును
18) బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు కూడా అంబుడ్స్ మన్ పథకాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ప్రస్తుతం ఏయే నగరాల్లో అంబుడ్స్ మన్ కార్యాలయాలు పనిచేస్తాయి ?
జ: చెన్నై, కోల్ కతా, ముంబై, ఢిల్లీ
19) మానవరహిత యుద్ధ విమానాన్ని DRDO కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చెళ్లకెరలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ లో విజయవంతంగా ప్రయోగించారు. దీని పేరేంటి ?
జ: రుస్తుం - 2
20) మార్చి1 , 2018 నుంచి ఏ బ్యాంకు ఎలక్టోరల్ బాండ్స్ అమ్మకాన్ని మొదలుపెట్టనుంది ?
జ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
21) ఫిబ్రవరి 2018 లో మరణించిన కున్వర్ బాయి ఏ రాష్ట్రానికి చెందిన స్వచ్ఛ భారత్ అభియాన్ కు మస్కట్ గా వ్యహరిస్తున్నారు ?
జ: ఛత్తీస్ గఢ్
22) ఆసియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది ?
జ: మనీలా, ఫిలిప్పీన్స్
23) స్టాక్ మార్కెట్లో గత నెలలో పీ - నోట్ల పెట్టుబడుతు ఎనిమిదిన్నరేళ్ల కనిష్టానికి పడిపోయాయి. పార్టిసిపేటరీ నోట్లు (పీ-నోట్లు) ఎవరికి జారీ చేస్తారు ?
జ: విదేశీ ఇన్వెస్టర్లకు
(నోట్: మనదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న విదేశీ ఇన్వెస్టర్లకు, సెబీ దగ్గర నమోదైన విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లకు పీ నోట్లు జారీ చేస్తారు )