Wednesday, October 23

2018 FEB TOP CURRENT AFFAIRS -1

01) స్కార్పిన్ శ్రేణికి చెందిన మూడో అత్యాధునిక జలంతర్గామి ముంబైలో జరిగిన కార్యక్రమంలో భారత నావికాదళంలో చేరింది. దాని పేరేంటి
జ: INS కరంజ్
02) వన్డే క్రికెట్ లో 200కు పైగా వికెట్లు తీసిన మొదటి మహిళా క్రికెటర్ ఎవరు ?
జ: ఝులన్ గోస్వామి
03) అంతర్జాతీయ మేధో హక్కుల (ఐపీ) సూచీలో భారత్ ర్యాంకింగ్ ఎంత ?
జ: 44వ స్థానం
04) 2018 ఫిబ్రవరిలో విడుదల చేసిన నీతి ఆయోగ్ ఆరోగ్య సూచీలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది
జ: కేరళ
05) 2018 ఫిబ్రవరిలో వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి ?
జ: ప్యాంగ్ చాంగ్ ( దక్షిణ కొరియా)
06) విదేశీ అతిధులకు ఇచ్చే ఏ అత్యున్నత పురస్కారాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి పాలస్తీనా సర్కార్ ఇచ్చింది ?
జ: గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీనా
07) 2018కి జ్ఞాన్ పీఠ్ పురస్కారం ఎవరికి దక్కింది ?
జ: కృష్ణ సోబతి ( ప్రముఖ హిందీ నవలా రచయిత్రి )
08) రక్త హీనతకు సమస్యకు పరిష్కారానికి బియ్యాన్ని తయారు చేసిన ఐఐటీ ఏది ?
జ: ఖరగ్ పూర్
09) మహిళల సానిటరీ న్యాప్ కిన్ల ఇబ్బందులపై తీసిన ప్యాడ్ మాన్ చిత్రంను ఏ దేశం నిషేధించింది ?
జ: పాకిస్తాన్
10) ప్రపంచవ్యాప్తంగా ధనిక నగరాల్లో 12వ స్థానం దక్కించుకున్న భారతీయ నగరం ఏది ?
జ: ముంబై
11) ఆంధ్రప్రదేశ్ - తెలంగాణల మధ్య 9వ షెడ్యూల్ లోని 89 సంస్థల విభజన కోసం విచారణ జరుపుతున్న కమిటీ ఏది ?
జ: షీలా బిడే కమిటీ
12)సాగు సంక్షోభంపై న్యూఢిల్లీలో 2018 ఫిబ్రవరి 19,20 తేదీల్లో జాతీయ సదస్సును ఎవరు నిర్వహించారు ?
జ: నీతి ఆయోగ్
13) భారత జాతీయ హాకీ జట్టుకు ప్రధాన స్పాన్సర్ గా వ్యవహరించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది ?
జ: ఒడిశా
14) ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద దేశంలో రోడ్డు సౌకర్యం లేని అన్నిగ్రామాలకు రహదారులు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం గతంలో 2022 వరకూ టార్గెట్ గా పెట్టుకుంది. ఇటీవల ఆ టార్గెట్ ను ఎంతకు కుదించారు ?
జ: 2019
15) 2018 సాహిత్య అకాడమీకి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ?
జ: చంద్రశేఖర కంబర్
16) నేపాల్ ప్రధానిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు ?
జ: కేపీ శర్మ ఓలీ
(నోట్: నేపాల్ ప్రెసిడెంట్ విద్యాదేవీ భండారీ )
17) మహిళలు, చిన్నారులపై లైంగిక హింస అంతం కావాలంటూ వన్ బిలియన్ రైజింగ్ పేరుతో కార్యక్రమం ఎక్కడ జరిగింది ?
జ: మనీలా (ఫిలిప్పీన్స్)
18) ఐక్యరాజ్య సమితి శరణార్దుల కార్యక్రమం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన దేశం ఏది
జ: టాంజానియా