ఏపీలో రెండేళ్ళలో 6 లక్షల ఉద్యోగాలు భర్తీ – 2021-22 కోసం 10,143 పోస్టులు రెడీ

ఏపీలో రెండేళ్ళలో 6 లక్షల ఉద్యోగాలు భర్తీ  –   2021-22 కోసం 10,143 పోస్టులు రెడీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2021-22 సంవత్సరానికి జాబ్ కేలండర్ ను రిలీజ్ చేశారు. ఈ ఏడాదిలో 10,143 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్టు చెప్పారు. YSR CP ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ళలో ఆంధ్రప్రదేశ్ లో 6 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినట్టు చెప్పారు. గత ప్రభుత్వాలు ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి గురించి అస్సలు పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ నియామకాలను ఎలాంటి అవినీతి, వివక్ష లేకుండా మెరిట్ ఆధారంగా భర్తీ చేసినట్టు చెప్పారు. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోపే 1.22లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు సీఎం జగన్ చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా 2.50 లక్షల మందికి పైగా నిరుద్యోగులను భాగస్వాములు చేసినట్టు తెలిపారు. దళారీ వ్యవస్థ లేకుండా ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ను కూడా ఏర్పాటు చేశామన్నారు సీఎం జగన్.

2021 జులై నుంచి మార్చి 2022 వరకూ జాబ్ కేలండర్
9 నెలల్లో 10,143 ఉద్యోగాలు భర్తీ
జులైలో 123 SC/ST బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేస్తారు
ఆగస్టులో APPSC ద్వారా గ్రూప్ 1, 2 కు చెందిన 36 పోస్టులకు నోటిఫికేషన్
సెప్టెంబర్ లో పోలీస్ శాఖలో 450 పోస్టులు
అక్టోబర్ లో 451 పోస్టుల వైద్య శాఖలో భర్తీ
నవంబర్ లో 5,251 పారా మెడికల్ పోస్టులు భర్తీ
డిసెంబర్ లో 441 నర్సులు పోస్టులకు నోటిషికేషన్
2022 జనవరిలో 240డిగ్రీ కాలేజీల లెక్చరర్ల భర్తీ
2022 ఫిబ్రవరిలో వివిధ వర్సిటీల్లో 2 వేల అసిస్టెంట్ పోస్టులు
2022 మార్చిలో వివిధ శాఖల్లో 36 పోస్టులను భర్తీ చేస్తారు.