21, 22 JAN CURRENT AFFAIRS

ఆంధ్రప్రదేశ్
1) ఏపీలో పరిపాలనలో అత్యున్నత సాంకేతికతను ఉపయోగిస్తున్నందుకు ఏ అవార్డును ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్వీకరించారు ?
జ: కలాం ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్
2) ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చేందుకు వాటర్ గ్రిడ్ లో భాగంగా ఎన్ని ఆవాసాల్లో కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు
జ: 36,884 ఇళ్ళు
( నోట్: రూ.15,730 కోట్ల ప్రాజెక్టు )

3) ఈ నెల 25న అతిపెద్ద జాతీయ పతాకాన్ని విజయవాడలో ఆవిష్కరిస్తున్నారు. దీనికి ఎొడవు ఎంత?
జ: 183 అడుగులు
4) ఇంధన రంగంలో గత 50 యేళ్ళుగా విశేష సేవలందిస్తున్న ఎవరికి లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు ?
జ: ఇంధన శాఖ సలహాదారు కె.రంగనాథం
5) జన్మభూమి - మా ఊరు కార్యక్రమ నిర్వహణలో చూపిన పనితీరు ఆధారంగా శాసన సభ నియోజకవర్గాలకు ప్రభుత్వం గ్రేడ్లు ఇచ్చింది. ఏ గ్రేడ్ కింద ఎన్ని నియోజకవర్గాలు నిలిచాయి
జ: 27
6) ఏపీలో అమలు చేస్తున్న ఆధార్ ఆధారితి విత్తన పంపిణీ ప్రాజెక్ట్ కు ఉత్తమ ఈ-గవర్నెన్స్ అవార్డు లభించింది. ఈ ప్రాజెక్ట్ పేరేంటి
జ: డీ -కృషి
7) లోక్ నాయక్ పురస్కారం ఎవరికి ప్రదానం చేశారు ?
జ: డాక్టర్ మీగడ రామలింగస్వామి (26 నందీ అవార్డుల గ్రహీత)
8) రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రిజిష్ట్రేషన్ చేసుకునే సౌకర్యం కల్పించి ఏపీ రిజిష్ట్రేషన్ల, స్టాంపుల శాఖకు ఈ గవర్నెన్స్ పురస్కారం ఇచ్చిందెవరు
జ: భారతీయ కంప్యూటర్ సొసైటీ నిహిలెంట్

జాతీయం
9) ఎన్నికల సంఘం కొత్త ప్రధాన కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: ఓం ప్రకాశ్ రావత్
(నోట్: ప్రస్తుత CEC ఏకే జోతి స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు )
10) దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలంటూ రూపొందించిన దేశభక్తి గీతం ఏది
జ: భారత్ కె వీర్
11) 2018-19 బడ్జెట్ పత్రాల ముద్రణకు ముందుగా న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్ లో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆధ్వర్యంలో ఏ వేడుక జరిగింది ?
జ: హల్వా వేడుక
12) ఆప్ ఎమ్మెల్యేల లాభదాయక పదవుల కేసులో ఎన్నికల కమిషన్ అనర్హత వేటుపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. ఎంతమందిని అనర్హత వేటు పడింది ?
జ: 20మంది ఎమ్మెల్యేలు
13) HPCL లోని ప్రభుత్వం వాటాలను ఏ సంస్థ కొనుగోలు చేయనుంది
జ: ONGC
14) ప్రపంచ జనాభాలో రెండో స్థానంలో ఉన్న భారత్ ఏ ఏడాది నాటికి మొదటి స్థానానికి చేరుతుందని అంచనా వేస్తున్నారు ?
జ: 2024లో
15) భారత్ లో మొదటగా ఎప్పుడు కుటుంబ నియంత్రణ పద్దతులను అమలు చేశారు ?
జ: 1952లో
16) వేల యేళ్ళ నాటి దేశీ విత్తనాలను ప్రకృతి వ్యవసాయ రైతులకు అందించేందుకు దేశీ విత్తనోత్సవం ఎక్కడ జరగనుంది
జ: హైదరాబాద్
17) అంధుల ప్రపంచ కప్ విజేత గా భారత్ జట్టు నిలిచింది. ఏ జట్టును భారత్ క్రీడాకారులు ఓడించారు ?
జ: పాకిస్తాన్

అంతర్జాతీయం
18) వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు ఎక్కడ జరుగుతోంది ?
జ: దావోస్ (స్విట్జర్లాండ్ )
19) అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF)చీఫ్ ఎవరు ?
జ: క్రిస్టీన్ లగార్డ్
20) అమెరికా విదేశాంగ శాఖలో ఆర్థిక వాణిజ్య వ్యవహారాల సహాయ కార్యదర్శిగా నియమితులైన భారతీయ సంతతి మహిళ ఎవరు ?
జ: మనీషా సింగ్ ( న్యాయవాది)