21 FEB CURRENT AFFAIRS QUIZ ( TS & AP)
01) GMR గ్రూపు సంస్థ అయిన GMR ఎయిర్ పోర్ట్స్ లిమిలెడ్ ( GAL) లో 49శాతం వాటాను రూ.10,780కోట్లతో సొంతం చేసుకున్న ఎయిర్ పోర్ట్ ఆపరేటర్ గ్రూపే ADP సంస్థ ఏ దేశానికి చెందినది ?
ఎ) ఫ్రాన్స్
బి) అమెరికా
సి) జర్మనీ
డి) యూకే
జ: ఎ సరైనది (ఫ్రాన్స్ )
02) భారత్ లో నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో ఏటా 1.50 లక్షల మంది చనిపోతున్నట్టు 7.5 లక్షల మంది క్షతగాత్రులు అవుతున్నట్టు ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. దీంతో ఏడాదికి జీడీపీలో ఎంత నష్టం జరుగుతుందని అంచనా వేసింది ?
ఎ) 4-5 శాతం
బి) 6-7 శాతం
సి) 3-5 శాతం
డి) 5-6 శాతం
జ: సి సరైనది ( 3-5శాతం )
03) ప్రభుత్వ రంగ సంస్థలకు సరైన మార్గదర్శకత్వం అందిస్తూ వాటి సంస్థాగత విలువను పెంచడంతో పాటు వాటాదార్లకు లాభాలు తెచ్చిపెట్టేందుకు కృషి చేసిన వారికి ఏటా బిజినెస్ లీడర్షిప్ అవార్డులను ఇస్తారు. ఢిల్లీలో జరుగుతున్న 7వ PSU అవార్డు ప్రధాన కార్యక్రమంలో తెలంగాణలో ఈ అవార్డు అందుకున్న NMDC CMD ఎవరు ?
ఎ) అర్జున్ రామ్ మేగ్వాల్
బి) బైజేంద్ర కుమార్
సి) అర్జున్ రాంపాల్
డి) సత్యేంద్ర జైన్
జ: బి సరైనది (బైజేంద్ర కుమార్)
04) కరోనా ప్రభావం జూన్ తర్వాత కూడా కొనసాగితే ప్రపంచ వృద్ధి రేటు ఎంతవరకూ క్షీణించే అవకాశం ఉందని డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ నివేదిక వెల్లడించింది ?
ఎ) 1 శాతం
బి) 2 శాతం
సి) 3 శాతం
డి) 4 శాతం
జ: ఎ సరైనది ( 1 శాతం )
05) ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి, వారసత్వాన్ని, ఆచారాలను సంరక్షించే ఏ ఆర్టికల్ ను రద్దు చేసే ఉద్దేశ్యం తమకు లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు ?
ఎ) 370 ఆర్టికల్
బి) 372 ఆర్టికల్
సి) 356 ఆర్టికల్
డి) 371 ఆర్టికల్
జ: డి సరైనది ( 371 ఆర్టికల్ )
06) మన సముద్ర తీర ప్రాంతాలు, సముద్ర జలాలను మరింత పకడ్బందీగా రక్షించేందుకు 27 నెలల్లోనే రీఫిట్టింగ్ చేసి ఏ జలాంతర్గామిని హిందూస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ తిరిగి నేవికి అప్పగించింది ?
ఎ) INS విక్రాంత్
బి) INS సింధువీర్
సి) INS అరిహంత్
డి) INS విక్రమాదిత్య
జ: బి సరైనది (INS సింధువీర్ )
07) సిస్టమ్, లేదా మొబైల్ లో కట్, కాపీ, పేస్ట్ గురించి అందరికీ తెలుసు. అయితే దీన్ని సృష్టించిన కంప్యూటర్ సైంటిస్ట్ చనిపోయారు. ఆయన పేరేంటి ?
ఎ) లారీ టెస్లర్
బి) అలన్ టురింగ్
సి) డోనాల్డ్ నుత్
డి) అడా లోవెలాస్
జ: ఎ సరైనవి ( లారీ టెస్లర్ )
08) ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ హాస్పిటల్స్, పాఠశాల్లలో మౌలిక వసతుల కల్పనకు ఉద్దేశించి, నాడు-నేడు పథకానికి 1048.82 కోట్ల రూపాయలను మంజూరు చేసిన బ్యాంక్ ఏది ?
ఎ) SBI
బి) NABARD
సి) ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB)
డి) వరల్డ్ బ్యాంక్
జ: బి సరైనది ( NABARD )
09) 2020 ఫిబ్రవరి నుంచి ఈ కింది ఏ వస్తువులను GST నుంచి మినహాయించారు ?
ఎ) ఇంధనం, నిర్మాణ రంగం, ఆల్కహాల్
బి) ఇంధనం, సినిమా టిక్కెట్లు, ఆల్కహాల్
సి) ఇంధనం, పొగాకు, ఆల్కహాల్
డి) ఇంధనం, డైరీ ఉత్పత్తులు, పొగాకు
జ: ఎ సరైనది ( ఇంధనం, నిర్మాణ రంగం, ఆల్కహాల్)
10) 2020-21 కేంద్ర బడ్జెట్ లో ప్రతిపాదించిన అత్యధిక ఆదాయంపన్ను స్లాబ్ ఎంత ?
ఎ) 25 శాతం
బి) 30శాతం
సి) 35 శాతం
డి) 40 శాతం
జ: బి సరైనది ( 30శాతం)
( కరెంట్ ఎఫైర్స్ క్విజ్ రూపంలో కావాలనుకుంటే visit : www.telanganaexams.com )