22 నవంబర్ 2022 కరెంట్ ఎఫైర్స్

22 నవంబర్ 2022 కరెంట్ ఎఫైర్స్

చంద్రుడికి దగ్గరగా వెళ్ళి ఒరాయన్ క్యాప్సూల్

  • అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా ప్రయోగించిన ఒరాయన్ క్యాప్సూల్ సోమ వారం చంద్రుడికి దగ్గరగా వచ్చి వెళ్లింది. జాబిల్లి అవతలి భాగాన్ని చుట్టింది.
  • 50 ఏళ్ల క్రితం చివరిసారిగా చందమామను సందర్శించాక మానవులు మోసుకెళ్లే సామర్థ్యమున్న వ్యోమనౌక వెళ్లడం ఇదే మొదటిసారి.
  • చంద్రుడిపైకి మళ్లీ వ్యోమగాములను పంపడం కోసం ఆర్టెమిస్ రాకెట్ ను నాసా ప్రయోగించింది. అందులోని ఒరాయన్ క్యాప్సూల్ లో వ్యోమ గాములకు బదులు మూడు డమ్మీలను ఉంచారు.
  • 2022 నవంబర్ 21 నాడు అది చంద్రుడి ఉపరితలానికి 130 కిలోమీటర్ల దూరం వరకూ వెళ్లింది. ఆ సమయంలో వ్యోమనౌక జాబిల్లి ఆవలివైపున ఉంది. దాంతో అరగంట పాటు ఒరాయన్ భూమికి కమ్యూనికేషన్ బంద్ అయింది.
  • జాబిల్లి ఆవతలి భాగం నుంచి వచ్చాక క్యాప్సూల్లోని కెమెరా.. భూమికి సంబంధించిన ఫొటోను పంపింది. ఆ సమయంలో ఈ వ్యోమనౌక గంటకు 8వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది.
  • కొద్దిసేపటి తర్వాత అది చంద్రుడి 'ట్రాంక్విలిటీ బేస్'కు ఎగువన ప్రయాణించింది.
  • 1969 జులై 20న నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ ఈ ప్రాంతంపైనే కాలు మోపారు.
  • చంద్రుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశించడానికి వీలుగా ఒరాయన్ ఇంజిన్ ను నాసా అధికారులు మండించారు. ఈ ప్రక్రియ ఎలా సాగిందో తెలుసుకోవడానికి డేటాను విశ్లేషిస్తున్నారు.
  • ఈ వారాంతంలో ఓరాయన్.. భూమి నుంచి 4 లక్షల కిలోమీటర్ల దూరం వెళ్లనుంది.
  • వ్యోమగాముల కోసం రూపొందించిన ఒక క్యాప్సూల్ అక్కడి వరకూ వెళ్లడం ఇదే మొదటిసారి.

 

అంతర్జాతీయ ప్రయాణికులకు ఎయిర్ సువిధ అక్కర్లేదు.

  • విదేశాల నుంచి మన దేశానికి వచ్చే విమాన ప్రయాణికులు కరోనా వివరాలతో ఉన్న ఎయిర్ సువిధ ఫామ్ నింపనక్కర్లేదు.
  • దేశంలో కరోనా కేసులు తగ్గడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇది 2022 నవంబర్ 22 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
  • కరోనా లేదని తెలిపే RTPCR రిపోర్ట్, టీకా తీసుకున్నట్టు డాక్యుమెంట్ గానీ సమర్పించాల్సిన అవసరం లేదు.
  • ప్రయాణీకుల బాడీ టెంపరేచర్స్ కొలిచే థర్మల్ స్క్రీనింగ్ మాత్రం ఎయిర్ పోర్టుల్లో కొనసాగుతుంది.
  • ఒక వేళ కరోనా లక్షణాలుంటే వాళ్ళని హెల్త్ సెంటర్ కు తరలిస్తారు.
  • విమానంలో ప్రయాణించేటప్పుడు మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి కాదని పౌర విమాన యాన శాఖ ఈమధ్యే ప్రకటించింది

భారత వృద్ధి అంచనాల్లో కోత విధించిన క్రిసిల్, ఇక్రా

  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి, రెండో త్రైమాసికా నికి వృద్ధి రేటు అంచనాలను రేటింగ్ సంస్థలు క్రిసిల్, ఇక్రా తగ్గించాయి.
  • అంతర్జాతీయ పరిస్థితులు, పంట దిగుబడి మిశ్రమంగా ఉండటంతో వృద్ధి రేటు తగ్గించాయి.
  • 2022-23కు భారత వృద్ధి అంచనాను 30 బేసిస్ పాయింట్లు తగ్గించి 7 శాతానికి క్రిసిల్ సవరించింది. రెండో త్రైమాసికంలో ఆర్ధిక వ్యవస్థ వృద్ధి 5 శాతమేనని ఇక్రా అంచనా వేసింది.
  • 2022-23కు వృద్ధి రేటును అంత క్రితం 3% అంచనా వేయగా.. ఇప్పుడు 7 శాతానికి తగ్గించింది.
  • అంతర్జాతీయంగా వృద్ధి నెమ్మదించింది.. ఎగుమతులు, పరిశ్రమల కార్యకలాపాలపై ప్రభావం చూపిస్తోంది.
  • దేశీయ గిరాకీ పుంజుకోవడంపైనా ఇది ప్రభావం చూపించవచ్చని క్రిసిల్ ముఖ్యఆర్ధికవేత్త ధర్మకీర్తి జోషి తెలిపారు.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారత వృద్ధి రేటు 5 శాతంగా ఉండొచ్చని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ తెలిపారు.