24 FEB 2020 CURRENT AFFAIRS ( TS & AP)

ఈ కరెంట్ ఎఫైర్స్ ను క్విజ్ రూపంలో రాయాలనుకుంటే ఈ కింది లింక్ ద్వారా www.telanganaexams.com లో రాసుకోగలరు

http://telanganaexams.com/24-feb-2020-current-affairs-quiz-ts-ap/

01)  భారత్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనకు సంబంధించి ఈ కింది అంశాల్లో సరైనవి ఏవి

ఎ) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 రోజుల పర్యటన కోసం గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి 2020 ఫిబ్రవరి 24నాడు చేరుకుంటారు

బి) అహ్మదాబాద్ లో ఇండియా రోడ్ షో పేరుతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు.  అహ్మదాబాద్ నగరంలోని మోతెరా స్టేడియంలో జరిగే నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీతో కలసి ట్రంప్ పాల్గొంటారు

సి) అమెరికా నుంచి రూ.16,200 కోట్ల విలువైన 24 MH 60 రోమియో హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి ఒప్పందాలు కుదిరే అవకాశముంది

డి) రూ.5,600 కోట్లకు సంబంధించి ఆరు అపాచీ హెలికాప్టర్లు (AH-64E) కొనుగోలు సంబంధించి ఒప్పందాలు కుదిరే అవకాశముంది.

1) అన్నీ సరైనవి

2) ఎ,బి,సి సరైనవి

3) బి,సి,డి సరైనవి

4) ఎ,బి సరైనవి

జ: 1 ( అన్నీ సరైనవి )

 

02) తెలంగాణలో బతుకమ్మ పండగ సందర్భంగా 18 యేళ్ళు దాటిన మహిళలకు నాలుగేళ్ళుగా బతుకమ్మ చీరలను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఒక్కోటి రూ.287ల విలువుగల  మొత్తం కోటి చీరలను తయారు చేయబోతున్నారు. ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత ?

1) రూ.287 కోట్లు

2) రూ.90 కోట్లు

3) రూ.100 కోట్లు

4) రూ.317 కోట్లు

జ: 4 సరైనది ( రూ.317 కోట్లు )

03) అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించబోతున్నారు.  వీటిని  ఏ పేరుతో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం 2015లో అధికారంలోకి వచ్చాక ప్రారంభించింది ?

1) మై క్లాస్ రూమ్

2) హ్యాపీ క్లాసెస్

3) హ్యాపీ స్కూల్

4) ఆద్మీ స్కూల్స్

జ: 2 సరైనది ( హ్యాపీ క్లాసెస్)

04)  న్యాయవ్యవస్థ – మారుతున్న ప్రపంచం అనే అంశంపై అంతర్జాతీయ న్యాయ సదస్సు( ఇంటర్నేషనల్ జ్యుడీషియల్ కాన్ఫరెన్స్ ) ఎక్కడ జరుగుతోంది ?

1) బెంగళూరులో

2) ముంబైలో

3) న్యూఢిల్లీలో

4) అహ్మదాబాద్ లో

జ: 3 సరైనది ( న్యూఢిల్లీలో )

05) రిజర్వ్ బ్యాంక్ అకౌంటింగ్ ఇయర్ ను మార్చబోతున్నారు. దీనికి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనవి గుర్తించండి

ఎ) ఆర్బీఐ ఫైనాన్షియల్ ఇయర్ ను ఏప్రిల్ నుంచి మార్చ్ వరకూ మార్చబోతున్నారు.  ఈ ఏడాది జులై నుంచి మొదలయ్యే ఇయర్ 2021 మార్చి 31తో ముగుస్తుంది

బి) 1935లో ఆర్బీఐ ఏర్పడినప్పుడు జనవరి టు డిసెంబర్ ఆర్థిక సంవత్సరంగా ఉండేది

సి) 1940లో దాన్ని జులై నుంచి జూన్ వరకూ మార్చారు.

డి) ఎకనమిక్ కేపిటల్ ఫ్రేమ్ వర్క్ పై ఏర్పాటైన బిమల్ జలాన్ కమిటీ సూచనల మేరకే ఆర్బీఐ ఆర్థిక సంవత్సరంలో మార్పు చేస్తున్నారు

1) అన్నీ సరైనవి

2) ఎ,బి,డి సరైనవి

3) ఎ,సి,డి సరైనవి

4) బి,సి,డి సరైనవి

జ: 1 ( అన్నీ సరైనవి )

06) 2020 మార్చి 1 నుంచి లాటరీలపై ఎంతశాతం GST ని విధించనున్నారు ?

1) 25శాతం

2) 30 శాతం

3) 28శాతం

4) 18 శాతం

జ: 3 సరైనది ( 28శాతం )

07) న్యూఢిల్లీలో జరుగుతున్న ఆసియా ఛాంపియన్షిప్ లో 74 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ గెలిచి ఒలింపిక్ క్వాలిఫయర్స్ కి అర్హత సాధించిన స్టార్ రెజ్లర్ ఎవరు ?

1) దీపక్ పునియా

2) జితేందర్ కుమార్

3) రాహుల్ అవారే

4) సుశీల్ కుమార్

జ: 2 సరైనది ( జితేందర్ కుమార్ )

08) సింగింగ్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ 11వ సీజన్ విజేతగా నిలిచిన బూట్ పాలిష్ వాలా ఎవరు ?

1) సన్నీ హిందుస్తానీ

2) రోహిత్ రౌత్

3) అంకోనా ముఖర్జీ

4) అద్రిజ్ ఘోష్

జ: 1 సరైనది  (సన్నీ హిందుస్తానీ )

09) గర్భంతో ఉన్నప్పుడు మహిళలు ఎలా ఉండాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, తిండి, మ్యూజిక్, ఎలా ఫిట్ గా ఉండాలి లాంటి 16 విలువైన అంశాలను నేర్పే గర్భ్ సంస్కార్ పేరుతో కొత్త కోర్సు ప్రవేశపెడుతున్న యూనివర్సిటీ ఏది ?

1) ఉస్మానియా యూనివర్సిటీ (తెలంగాణ)

2) ఆంద్ర విశ్వవిద్యాలయం ( ఆంద్రప్రదేశ్)

3) లక్నో యూనివర్సిటీ (ఉత్తర్ ప్రదేశ్ )

4)  సెంట్రల్ యూనివర్సిటీ ( న్యూఢిల్లీ)

జ: 3 సరైనది (లక్నో యూనివర్సిటీ (ఉత్తర్ ప్రదేశ్ )

10) ముంబైలోని YRF స్టూడిలో జరిగిన మిస్ దివా యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచి ఈ ఏడాది జరిగే మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనే అర్హత సాధించిన మంగళూరు అమ్మాయి ఎవరు ?

1) అవృతి చౌదరి

2) ఎడ్లిన్ కేస్టిలినో

3) నేహా జైస్వాల్

4) ఆశా భట్

జ: 2 సరైనది (ఎడ్లిన్ కేస్టిలినో)

 

11) అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ (FBI) వెల్లడించిన ఇంటర్నెట్ క్రైమ్ రిపోర్ట్ 2019 ప్రకారం సైబర్ నేరాల్లో అమెరికాని మినహాయిస్తే భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ?

1) మూడో స్థానం

2) రెండో స్థానం

3) మొదటి స్థానం

4) నాలుగో స్థానం

జ: 1 సరైనది ( మూడో స్థానం )

నోట్: భారత్ లో 2,901 నేరాలతో మూడో స్థానంలో ఉంది.  93,796 సైబర్ నేరాలతో బ్రిటన్ మొదటి స్థానం, 3,721 స్థానాలతో కెనడా రెండో స్థానంలో ఉన్నాయి.  అమెరికాలో గత ఏడాది 4,67,361 సైబర్ నేరాలు జరిగాయి.

 

12) పేదలకు పెద్ద చదువులు అందించే ఉద్దేశ్యంతో జగనన్న వసతి దీవెన పేరుతో కొత్త కార్యక్రమాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రారంభిస్తున్నారు ?

1) అమరావతి

2) విశాఖపట్నం

3) విజయనగరం

4) శ్రీకాకుళం

జ: 3 సరైనది ( విజయనగరం )

నోట్: ఏటా ITI విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్ కి రూ.15వేలు, డిగ్రీ, ఆపై కోర్సుల విద్యార్థులకు రూ.20వేలను హాస్టల్ , మెస్ ఛార్జీల కోసం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు.