24 JAN CURRENT AFFAIRS

జాతీయం
1) 20యేళ్ళ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నుద్దేశించి ప్రారంభ ఉపన్యాసం చేశారు. గతంలో ఎవరు ఈ సమావేశాలకు హాజరయ్యారు ?
జ: 1997లో అప్పటి ప్రధాని దేవెగౌడ
2) డ్యామ్స్ భద్రతపై అంతర్జాతీయ సదస్సు ఎక్కడ జరగనుంది ?
జ: తిరువనంతపురం
3) విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ (VSSC) కొత్త డైరక్టర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: ఎస్ సోమనాథ్
4) రెండో ప్రపంచ యుద్దం మెమోరియల్ మ్యూజియంను ఇటీవల ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు ?
జ: అరుణాచల్ ప్రదేశ్
5) రిజర్వ్ బ్యాంక్ అంచనాల ప్రకారం భారత్ లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎక్కువగా పెడుతున్న దేశం ఏది ?
జ: మారిషస్
(నోట్: రెండో స్థానం అమెరికా, మూడు బ్రిటన్, నాలుగు సింగపూర్. మారిషస్ మార్కెట్లో 21.8శాతం షేర్ వ్యాల్యూని కలిగి ఉంది)
6) 63వ జియో ఫిల్మ్ ఫేర్ అవార్డులు 2018లో ఉత్తమ చిత్రంగా ఎంపికైనది ఏది
జ: హిందీ మీడియం
7) దక్షిణాఫ్రికాలో జరిగే మహిళల ఐదు మ్యాచుల టీ 20 క్రికెట్ సిరీస్ కు ఎవరు కెప్టెన్ గా ఎంపికయ్యారు ?
జ: హర్మన్ ప్రీత్ కౌర్

అంతర్జాతీయం
8) స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 48వ వార్షిక సమావేశాల యొక్క థీమ్ ఏంటి ?
జ: Creating a Shared Future in a Fractured World
9) 2018 ఇండియా ఆసియాన్ బిజినెస్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరుగుతోంది ?
జ: న్యూ ఢిల్లీ
10) ICC మహిళల ప్రపంచ క్రికెట్ టీ20 2018 టోర్నమెంట్ ఏ దేశంలో జరగనుంది ?
జ: వెస్ట్ ఇండీస్
11) 15వ ముంబై మారథాన్ 2018 పోటీల్లో సోలోమన్ దేక్సియా విజేతగా నిలిచాడు. ఈయన ఏ దేశానికి చెందిన వారు ?
జ: ఇథియోపియా