25 FEB 2020 CURRENT AFFAIRS ( TS & AP )
ఈ కరెంట్ ఎఫైర్స్ క్విజ్ గా రాయాలనుకుంటే ఈ కింది లింక్ ద్వారా రాయగలరు
http://telanganaexams.com/25-feb-2020-current-affairs-quiz-ts-ap/
01) తెలంగాణ రాష్ట్రమంతటా పట్టణ ప్రగతి కార్యక్రమం మొదలైంది. మొత్తం ఎన్ని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో పది రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది ?
ఎ) 129
బి) 140
సి) 139
డి) 130
జ: బి సరైనది ( 140 )
02) వ్యవసాయ రంగంలో మంచి ప్రగతి సాధిస్తున్న వారి కోసం ఉద్దేశించిన ఔట్ లుక్ అగ్రికల్చర్ కాన్ క్లేవ్ అండ్ స్వరాజ్ అవార్డ్స్ 2020 లో జాతీయ స్థాయిలో ఉత్తమ సహకార సంఘం అవార్డు ఏ PACS కి దక్కింది ?
ఎ) చేవెళ్ళ ( రంగారెడ్డి జిల్లా)
బి) గంగాధర ( కరీంనగర్ జిల్లా)
సి) ముల్కనూరు (వరంగల్ అర్భన్ జిల్లా)
డి) వేములవాడ (సిరిసిల్ల జిల్లా )
జ: సి సరైనది
03) ఏపీలోని విజయవాడకు చెందిన ప్రముఖ రచయిత్రి పి.సత్యవతికి అనువాద విభాగంలో 2019 సంవత్సరానికి సాహిత్య అకాడమీ లభించింది. ఆమె రాసిన ఏ నవలకి ఈ అవార్డు లభించింది ?
ఎ) ఒక హిజ్రా ఆత్మకథ
బి) ఒక యోగి ఆత్మకథ
సి) ఒక మహిళ ఆత్మకథ
డి) ఒక పండితుడి ఆత్మకథ
జ: ఎ సరైనది
నోట్: ది ట్రూత్ అబౌట్ మీ : ఏ హిజ్రా లైఫ్ స్టోరీ అనే ఆంగ్ల ఆత్మకథను సత్యవతి తెలుగులోకి అనువదించారు.
04) భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ తో వస్తున్న సినిమాను కరణ్ జోహార్ నిర్మించనున్నారు. ఇందులో గంగూలీ పాత్రను ఎవరు పోషించే అవకాశముంది ?
ఎ) ఆమీర్ ఖాన్
బి) వరుణ్ ధావన్
సి) జాన్ అబ్రహం
డి) హృతిక్ రోషన్
జ: డి సరైనది ( హృతిక్ రోషన్)
05) స్వలింగ సంపర్కపు ఆరోపణలతో రాజీనామా చేసిన మలేసియా ప్రధాని ఎవరు ?
ఎ) మహతీర్ మహమ్మద్
బి) అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్
సి) అన్వర్
డి) నజీబ్ రజాక్
జ: ఎ సరైనది
06) ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ( PM కిసాన్ యోజన) పథకం ప్రారంభించి ఏడాది అవుతున్న సందర్భంగా రైతుల కోసం మొబైల్ యాప్ ను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆవిష్కరించారు. అయితే ఈ పథకం కింద రైతులకు ఏటా ఎంత మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తోంది ?
ఎ) 7 వేలు
బి) 10 వేలు
సి) 6 వేలు
డి) 4 వేలు
జ: సి సరైనది ( 6 వేలు )
07) ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఆంట్రపెన్యూర్ అవార్దు 2019 కు ఎవరు ఎంపికయ్యారు ?
ఎ) కిరణ్ మజుందార్ షా
బి) ఆది గోద్రెజ్
సి) ఉదయ్ కొఠక్
డి) శ్రీధర్ వెంబు
జ: ఎ సరైనది (కిరణ్ మజుందార్ షా)
08) వరుసగా మూడో ఏడాది కూడా ESPN ఉత్తమ మహిళా క్రీడాకారిణి అవార్డు దక్కించుకున్న ఇండియన్ ప్లేయర్ ఎవరు ?
ఎ) మేరీ కోమ్
బి) సానియా మీర్జా
సి) పి.వి. సింధు
డి) సైనా నెహ్వాల్
జ: సి సరైనది ( పి.వి. సింధు)
09) నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో Sustainable Development Goals Conclave 2020 ఎక్కడ జరిగింది ?
ఎ) న్యూఢిల్లీ
బి) గౌహతి
సి) కోల్ కతా
డి) షిల్లాంగ్
జ: బి సరైనది ( గౌహతి )
10) అటల్ కిసాన్ మజ్దూర్ క్యాంటిన్స్ స్కీమ్ ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు ?
ఎ) ఉత్తర్ ప్రదేశ్
బి) హరియాణా
సి) ఉత్తరాఖండ్
డి) మధ్యప్రదేశ్
జ: బి సరైనది (హరియాణా)