25 JAN CURRENT AFFAIRS

ఆంధ్రప్రదేశ్
1) దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఇంటరాక్టివ్ లంచ్ ఆన్ ప్రోగ్రామ్ లో ఏ అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు ?
జ: టెక్నాలజీ ఫర్ ఇన్నోవేషన్స్
2) రాష్ట్రంలో విమానాల ఉత్పత్తి కేంద్రం ఎయిర్ బస్ తమ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. ఏ విమానాలను తయారు చేయనుంది ?
జ: C-295
3) ఫిబ్రవరి 3నుంచి 5 వరకూ అమరావతిలో ఏ పేరుతో బౌద్ధ వారసత్వ ఉత్సవాలు నిర్వహిస్తున్న మంత్రి అఖిల ప్రియ తెలిపారు ?
జ: విశ్వశాంతి
4) పురపాలక సంఘాల్లో ఆస్తిపన్నువసూళ్ళలో అక్రమాలు అరికట్టేందుకు ఏ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది ?
జ.: సైబర్ ట్రెజరీ
5) వేటూరి సాహితీ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
జ: సినీ గేయ రచయిత చంద్రబోస్
6) స్కూళ్ళల్లో విద్యార్థులు, టీచర్ల హాజరు, మధ్యాహ్నభోజన పథకం అమలు తదితర వివరాల సేకరణకు కేంద్రం ఏ పథకాన్ని మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్ గడ్ తో పాటు ఏపీలోనూ అమలు చేయనుంది ?
జ: శాలకోశ్
7) విద్యార్థుల ఆత్మహత్యల నివారణ కోసం కడప పోలీసులు చేపట్టిన కార్యక్రమం ఏది
జ: జయహో... యువత
8) విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు సాయం చేసేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం ఏది ?
జ: విదేశీ విద్యాదీవెన
9) భారత పరిశ్రమల సమాఖ్యతో కలసి ఏపీ ప్రభుత్వం మూడో భాగస్వామ్య సదస్సును వచ్చే 24నుంచి ఎక్కడ నిర్వహించనుంది ?
జ: విశాఖపట్నం
10) అన్ని పాఠశాలల విద్యార్థునులకు శానిటరీ నాప్ కిన్స్ అందించే పథకం పేరేంటి
జ: సహజ

జాతీయం
11) ప్రతియేటా జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ?
జ: జనవరి 25
12) దేశంలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు తక్కువ రేట్లతో విమానయాన సౌకర్యం కల్పించేందుకు ఉద్దేశించిన ఉడాన్ (ఉడే దేవ్ కా ఆమ్ నాగరిక్) లోకి కొత్తగా ఎన్ని మార్గాలను చేర్చారు?
జ: 325 మార్గాలు
13) భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన ఏ వ్యాక్సిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రీ క్వాలిఫికేషన్ గుర్తింపు ఇచ్చింది ?
జ: రోటా వ్యాక్
14) తీవ్రవాదుల బుల్లెట్ల నుంచి అమర్ నాథ్ యాత్రికులను కాపాడిన బస్సు డ్రైవర్ కు రిపబ్లిక్ డే సందర్బంగా సాహస అవార్డు ప్రకటించింది. ఆయన పేరేంటి ?
జ: షేక్ సలీం గఫూర్
15) ఈసారి భారత రిపబ్లిక్ డే ఉత్సవాలకు ఎంతమంది అతిథులు హాజరవుతున్నారు ?
జ: 10 దేశాల అధినేతలు ( ఆసియాన్ దేశాధినేతలు)
16) రిపబ్లిక్ డే ఉత్సవాల సందర్బంగా 2018 భారత్ పర్వ్ కార్యక్రమాన్ని ఏ చారిత్రక కట్టడం దగ్గర ఏర్పాటు చేస్తున్నారు ?
జ: ఎర్ర కోట
17) జాతీయ బాలికల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతారు ?
జ: జనవరి 24
18) డెలాయిట్ గ్లోబల్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలోని 250 ప్రముఖ కంపెనీల్లో మన దేశానికి చెందిన ఏ సంస్థకు స్థానం దక్కింది ?
జ: రిలయన్స్ రిటైల్
19) మహిళల సీనియర్ జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 63 కేజీల విభాగంలో రికార్డు సృష్టించింది ఎవరు ?
జ: రాఖీ హాల్దర్
20) అలనాటి నటి క్రిష్ణ కుమారి చనిపోయారు. ఆమె ఎన్ని చిత్రాల్లో నటించారు ?
జ: 110

అంతర్జాతీయం
21) పాక్ - ఆఫ్గాన్ సరిహద్దుల్లో హక్కానీ నెట్ వర్క్ ఉగ్రవాద గ్రూపులపై డ్రోన్ దాడులు చేసిన దేశం ఏది ?
జ: అమెరికా
22) పసుపులో ఉండే ఏ పదార్థం వల్ల మతిమరుపు సమస్య తగ్గుతుందని అమెరికన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు
జ: కుర్కుమిన్

 

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, అభ్యర్థుల కోసం ఈ కింది వాట్సాప్, టెలిగ్రాం, ఫేస్ బుక్ ఖాతాలను ఓపెన్ చేశాం. జాయిన్ అవగలరు.

1) AP TRT&TET (Whatsapp)
https://chat.whatsapp.com/9fIgnM2qIwDF9xjjvyHQjP

2) ANDHRAEXAMS.COM (Whatsapp)
https://chat.whatsapp.com/Dx8wlXbujoo8V9RxX6ZbMx

3) AP TRT & TET ( TELEGRAM)
https://t.me/joinchat/GPhsigzvdsrqGJnUDu2KQg

4) ANDHRA EXAMS (FACE BOOK PAGE)
https://www.facebook.com/Andhra-exams-180377329217436/

5) ANDHRA EXAMS ( TELEGRAM GROUP)

https://t.me/joinchat/AAAAAEONuGBol_CX0Ks_zQ