26 AUG CURRENT AFFAIRS QUIZ

26 AUG CURRENT AFFAIRS QUIZ

1. 600 వికెట్లు తీసిన తొలి పేసర్ గా వరల్డ్ రికార్డు సాధించిన ఇంగ్లండ్ పేసర్ ఎవరు ?

2. టీమ్ ఇండియా క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి సంబంధించి ఈ కింది వాటిల్లో సరైన స్టేట్ మెంట్ ఏది ?

ఎ) ధోనీ 2020 ఆగస్టు 15 నాడు ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు

బి) ఆయన 2004 డిసెంబర్ 23న తన మొదటి వన్డే తో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించాడు

సి) 2019 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనలత్స్ జులై 10న తన చివరి మ్యాచ్ ఆడాడు

డి) 2014 డిసెంబర్ లోనే ధోని టెస్టు మ్యాచ్ లకు గుడ్ బై చెప్పాడు

3. గత మూడేళ్ళలో డిజిటల్ చెల్లింపుల్లో ఎంత శాతం పెరుగుదల ఉన్నట్టు ఆర్బీఐ వార్షిక నివేదిక 2019-20 వెల్లడించింది.

4. దేశంలో పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత నగదు చెలామణి ఏ మాత్రం తగ్గలేదని ఆర్భీఐ వార్షిక నివేదిక 2019-20 వెల్లడించింది.  గత మూడేళ్ళలో దేశంలో నగదు చెలామణి ఎంత శాతం పెరిగినట్టు ఆర్బీఐ తెలిపింది ?

5. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ కథా, గేయ రచయిత కలువకొలను సదానంద చిత్తూరు జిల్లా పాకాలలో మరణించారు. ఆయన 200కు పైగా కథలు, 100 గేయాలు, 8 కథా సంపుటాలు , రెండు నవలలు రాశారు.  సదానంద రాసిన కథ ఆధారంగా 1980లో శ్రీదేవి, కృష్ణ నటించిన సినిమా వచ్చింది. దాని పేరేంటి ?

6. న్యూరల్ TTS సేవలను భారత్ లోని ఏయే దేశాల్లో ప్రారంభించినట్టు మైక్రో సాఫ్ట్ ప్రకటించింది ?

7. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కొత్త డైరక్టర్ జనరల్ గా ఎవరి నియామకాన్ని కేంద్ర కేబినెట్ వ్యవహారాల కమిటీ 2020 ఆగస్టు 17న ఆమోదించింది ?

8. తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, పట్టణాల్లో భవన నిర్మాణా అనుమతులకు సంబంధించిన TS BPASS విధానాన్ని ఎప్పటి నుంచి అమల్లోకి తెస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ?

9. ఎలక్ట్రిక్ వాహనాలు, డ్రోన్లు తదితర వాటిల్లో వినియోగించేందుకు ధర తక్కువ, సామర్థ్యం ఎక్కువతో లిథియం- సల్ఫర్ బ్యాటరీని ఆవిష్కరించిన పరిశోధకులు ఏయే విద్యాలయాలకి చెందినవారు ?

10. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2020 టైటిల్ స్పాన్సర్ షిప్ ను రూ.222 కోట్లతో దక్కించుకున్న సంస్థ ఏది ? (కిందటేడాది వివో సంస్థ రూ.440 కోట్లతో స్పాన్సర్ షిప్ ను దక్కించుకుంది.  ఈసారి 40శాతం కంటే తక్కువగా వచ్చింది)