26 JAN CURRENT AFFAIRS

ఆంధ్రప్రదేశ్
1) ఏ క్లౌడ్ కంప్యూటింగ్, వెబ్ సర్వీసెస్ కంపెనీ రాష్ట్రంలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబుకి హామీ ఇచ్చింది ?
జ: అలీబాబా క్లౌడ్
2) జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం నివేదిక ప్రకారం తెలంగాణ, ఏపీల్లో ఎంతమందికి మరణశిక్షలు ఖరారయ్యాయి ?
జ: తెలంగాణలో - ఆరుగురు, ఏపీలో - ఇద్దరికి
3) ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు చేసుకునే మహిళలకు రూ.700-800 విలువైన వేటిని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: మదర్ కిట్స్
4) దళితులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై అవగాహన పెంచేందుకు రాష్ట్రంలో చేపట్టబోయే కార్యక్రమం పేరేంటి ?
జ: చంద్రన్న ముందడుగు
5) తమకంటూ ప్రత్యేకంగా విశ్వ విద్యాలయ గీతాన్ని ఆవిష్కరించిన యూనివర్సిటీ ఏది ?
జ: నన్నయ విశ్వ విద్యాలయం ( రాజమహేంద్రవరం)
6) ఆంధప్రదేశ్ లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఎక్సలెన్స్ కేంద్రం ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంస్థ ఏది
జ: హ్యూలెట్ ప్యాకార్డ్ ( HP)

7) బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ కి ఏ అవార్డు దక్కింది ?
జ: పద్మశ్రీ

జాతీయం
8) ఆసియాన్ దేశాలతో అనుబంధం పెంచుకొనడంలో భాగంగా ఆ దేశాల ప్రముఖులకు ఎన్ని పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు ?
జ: 10 (దేశానికి ఒకటి చొప్పున)
9) ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకి ఏ అవార్డు దక్కింది ?
జ: పద్మ విభూషణ్
10) పద్మ విభూషణ్ దక్కించుకున్న ప్రముఖులు ఎవరు ?
జ: పరమేశ్వరన్ ( కన్యాకుమారిలోని వివేకానంద కేంద్రం అధ్యక్షుడు)
గులాం ముస్తాఫా ఖాన్ ( గాయకుడు)
11) పద్మ భూషణ్ అందుకున్న క్రీడాకారులు ఎవరు ?
జ: ఎం.ఎస్. ధోని, పంకజ్ అద్వానీ
12) దేశంలో మరణశిక్షలు తగ్గాయి. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం నివేదిక ప్రకారం 2017 చివరి నాటికి ఎంతమందికి ఉరిశిక్షలు ఖరారయ్యాయి ?
జ: 371 మందికి
13) జీవిత భీమాతో పాటు తీవ్ర అనారోగ్యానికి కూడా రక్షణ అందేలా పుర్ణ సురక్ష పేరుతో పాలసీని విడుదల చేసిన సంస్థ ఏది ?
జ: SBI లైఫ్ ఇన్సూరెన్స్
14) విమానాల లోపల ఇంటర్నెట్, ఎంటర్ టైన్ మెంట్ అందించే అంతర్జాతీయ సంస్థ గోగో తన టెక్నాలజీ అభివృద్ధి కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనుంది ?
జ: చెన్నైలో

అంతర్జాతీయం
15) దక్షిణ చైనా సముద్రంలో ప్రవర్తనా నియమావళిని అమల్లోకి తేవాలని ఏ సమావేశం తీర్మానించింది ?
జ: ఢిల్లీలో జరిగిన భారత్ - ఆసియాన్ సదస్సు
16) ప్రస్తుతం భారత్ - ఆసియాన్ దేశాల కూటమి వాణిజ్యం ఎంతకు చేరింది ?
జ: 70 బిలియన్ డాలర్లు
17) 8 వందల యేళ్ళ చరిత్రలో ఓ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందినవారిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. ఆ యూనివర్సిటీ ఏది
జ: ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ (లండన్ )
18) భూవాతావరణం, అంతరిక్షం కలిసేచోట వాతావరణ పొరల్లోని మార్పులను అధ్యయనం చేయడానికి అంతరిక్ష సంస్థ నాసా ఏ మిషన్ ను రంగంలోకి దింపుతోంది ?
జ: The Global Scale Observations of the Limb and Disc (GOLD)

 

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, అభ్యర్థుల కోసం ఈ కింది వాట్సాప్, టెలిగ్రాం, ఫేస్ బుక్ ఖాతాలను ఓపెన్ చేశాం. జాయిన్ అవగలరు.

1) AP TRT&TET (Whatsapp)
https://chat.whatsapp.com/9fIgnM2qIwDF9xjjvyHQjP

2) ANDHRAEXAMS.COM (Whatsapp)
https://chat.whatsapp.com/Dx8wlXbujoo8V9RxX6ZbMx

3) AP TRT & TET ( TELEGRAM)
https://t.me/joinchat/GPhsigzvdsrqGJnUDu2KQg

4) ANDHRA EXAMS (FACE BOOK PAGE)
https://www.facebook.com/Andhra-exams-180377329217436/

5) ANDHRA EXAMS ( TELEGRAM GROUP)

https://t.me/joinchat/AAAAAEONuGBol_CX0Ks_zQ