26 నవంబర్ 2022 కరెంట్ ఎఫైర్స్

26 నవంబర్ 2022 కరెంట్ ఎఫైర్స్

రూపాయి, దిర్హామ్ లో వాణిజ్యంపై భారత్, UAE చర్చలు

  • లావాదేవీల ఖర్చులను నియంత్రించేందుకు రూపాయి, దిర్హామ్ లో రెండు దేశాల మధ్య వాణిజ్యం జరుపుకోవడంపై భారత్, UAE సెంట్రల్ బ్యాంకులు చర్చిస్తున్నాయి.
  • స్థానిక కరెన్సీల్లో వాణిజ్యంపై ఓ డిస్కషన్ పేపర్ ను భారత్ రెడీ చేసిందని UAEలో భారత రాయబారి సుంజయ్ సుధీర్ తెలిపారు.
  • 2023 మే 1 నుంచి రెండు దేశాలు అమలు చేసే స్వేచ్ఛా, వాణిజ్య ఒప్పందానికి ఇది ఉపయోగపడనుంది.
  • 2022 సెప్టెంబరులో ఈ అంశంపై మొదటిసారిగా చర్చలు జరిగాయి. అంతర్జాతీయ వాణిజ్యవర్గాల్లో దేశీయ కరెన్సీపై ఆసక్తి పెరిగడంతో భారత రూపాయల్లో ఎగుమతి, దిగుమతి లావాదేవీల నిర్వహించుకోవాలని బ్యాంకులకు RBI సూచించింది.

ప్రపంచ మహిళలపై ద్రవ్యోల్బణం ఎఫెక్ట్ :  ఆక్స్ ఫాం నివేదిక

  • ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ద్రవ్యోల్బణాన్ని అధిగమించేందుకు మహిళలతో ఎక్కువ పని చేయిస్తూ వాళ్ళని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయని ది అసాల్ట్ ఆఫ్ ఆస్టరిటీ పేరుతో ఆక్స్ ఫాం నివేదిక విడుదల చేసింది.
  • కరోనా మహమ్మారి మహిల ఉపాధి అవకాశాలపై ప్రభావం చూపించింది. 2020తో పోల్చితే 2021లో ఉపాధి పొందిన మహిళల సంఖ్య తగ్గింది.
  • ఈ మహమ్మారితో జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటూ ఆర్థికవృద్ధి సాధించడం, ద్రవ్యోల్బణం నుంచి గట్టెక్కడం కోసం మహిళలు, బాలికలతో ఎక్కువ పని చేయిస్తున్నారు. దాంతో మహిళలు పేదరికంలోకి కూరుకుపోతున్నారు. కొన్ని సందర్భాల్లో అకాలమరణం పొందుతున్నారని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.
  • ఈ కోతల ద్వారా 2023లో ప్రభుత్వాలు పొదుపు చేయాలని చూస్తున్న మొత్తం కంటే, ప్రపంచ ధనికుల నుంచి సేకరించే కార్పొరేట్ ట్యాక్స్ రూ.81,89325 కోట్లు (ఒక ట్రిలియన్ డాలర్లు) అధికమవుతుందని నివేదిక పేర్కొంది.
  • ఇలా మహిళలతో వెట్టి చాకిరీ చేయించడం లింగ వివక్షతో కూడిన హింసేనని ఆక్స్ ఫాం జెండర్ జస్టిస్ అండ్ రైట్స్ హెడ్ అమీనా హెర్సీ తెలిపారు

మహారాష్ట్ర గ్రామానికి 26/11 దాడిలో అమరుడు విష్ణు షిండే పేరు

  • 14 ఏళ్ల క్రింత జరిగిన ముంబై ఉగ్రవాద దాడి (26/11) లో అమరుడైన జవాను రాహుల్ షిండే పేరును ఆయన స్వగ్రామానికి పెట్టారు.
  • మహారాష్ట్రలోని షోలాపుర్ జిల్లా సుల్తాన్ పూర్ లో 600 ఇళ్లు ఉంటాయి. అమర జవాన్ పుట్టి పెరిగిన ఈ గ్రామం పేరును రాహుల్ నగర్ గా మార్చారు…
  • స్టేట్ రిజర్వు పోలీస్ ఫోర్సు (SRPF)లో కానిస్టేబుల్ అయిన రాహుల్ తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్లోకి ముందుగా ప్రవేశించగా.. ఉగ్రవాదులు ఆయనపై కాల్పులు జరిపారు. పొట్టలోకి బుల్లెట్ దిగడంతో ప్రాణాలు కోల్పోయారు.

రామ జన్మభూమి చరిత్రపై డాక్యుమెంటరీకి  అమితాబ్ డబ్బింగ్

  • శ్రీరామ జన్మభూమి చరిత్రపై తయారైన డాక్యుమెంటరీకి డబ్బింగ్ చెప్పాలని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ అయోధ్య రామాలయ నిర్మాణ కమిటీ కోరింది.
  • ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలను ప్రముఖ రచయిత, ఫిల్మ్ సెన్సార్ బోర్డు చైర్మన్ ప్రసూన్ జోషితో పాటు... దర్శకుడు డా. చంద్రప్రకాశ్ ద్వివేది, ప్రముఖ రచయిత యతీంద్ర మిశ్రా, ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ ఆర్ట్స్ కార్యదర్శి సచిదానంద జోషితో ఉన్న కమిటీ చేపట్టింది.
  • వాల్మీకి రామాయణంలోని ఘట్టాల ఆధారంగా దాదాపు వంద ఐకానోగ్రాఫిక్ ప్యానెళ్లను అయోధ్యలో నిర్మిస్తున్న ఆలయ స్తంభాలపై ఏర్పాటు చేస్తామని నిర్మాణ కమిటీ తెలిపింది.

నల్లమల అడవుల్లో కొత్త మొక్క గుర్తింపు

  • నల్లమల అడవుల్లో కొత్త మొక్కను కనుగొన్నారు. జడ్చర్లలోని డా. బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ బాటనీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. బి. సదాశివయ్య, ఏపీ జీవ వైవిధ్య మండలి సభ్యుడు డా.ప్రసాద్, ఓయూ వృక్ష శాస్త్ర విభాగానికి చెందిన నిర్మల బాబూరావు, పరిశోధక విద్యార్థులు దీన్ని గుర్తించారు.
  • అటవీశాఖ ఆధ్వర్యంలో గడ్డిజాతులపై పరిశోధనల్లో భాగంగా ఈ మొక్క గుర్తించారు. యుఫోర్బియేసి కుటుంబానికి చెందిన ఈ మొక్కకు యుఫోరియా తెలంగాణేన్సిస్ అని పేరు పెట్టారు.
  • ఇది దాదాపు 30 సెంటీమీటర్ల పొడవు పెరిగి, పాల లాంటి లేటెక్స్ (జిగురు పదార్థం) కలిగి ఉంటుంది
  • మొక్కలో ఔషధ గుణాలుండొచ్చని అంటున్నారు. ఈ మొక్క గురించి పైటోటాక్సా అనే జర్నల్ పబ్లిష్ అయింది.

 

ఏడాది పాటు కరెంట్ ఎఫైర్స్ తో పాటు ప్రతి రోజూ పేపర్ క్లిప్పింగ్స్ కోసం ఈ కింది లింక్ ద్వారా కేవలం రూ.100తో కోర్సును ఈ కింది లింక్ ద్వారా purchase చేయండి.

https://atvqp.courses.store/114635?utm_source%3Dwhatsapp%26utm_medium%3Dtutor-course-referral-wa%26utm_campaign%3Dcourse-overview-app