27, 28 JAN CURRENT AFFAIRS

ఆంధ్రప్రదేశ్
1) స్విట్జర్లాండ్ దావోస్ లో ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుల్లాగా ప్రతి సంవత్సరం అంతర్జాతీయ స్థాయిలో ఆనంద నగరాల సదస్సు (హ్యాపీ సిటీస్ సమ్మిట్) ను ఏపీలో ఎక్కడ నిర్వహించనున్నారు ?
జ: అమరావతి
2) రాష్ట్రంలో తెలుగు సాహితీ మహోత్సవాలు ఎక్కడ జరుగుతున్నాయి
జ: తెనాలిలో
3) ఆంధ్రప్రదేశ్ లో ఇన్నోవేషన్ ల్యాబ్ ఏర్పాటుకు ఏ యూనివర్సిటీ గవర్నమెంట్ ల్యాబ్ ముందుకొచ్చింది ?
జ: న్యూయార్క్ ( అమెరికా)

జాతీయం
4) ఈనెల 9న ప్రధాని నరేంద్ర మోడీ పాలస్తీనాకి వెళ్తున్నారు. ఆ దేశం అడుగుపెడుతున్న ప్రధానుల్లో మోడీ ఎన్నోవారు ?
జ: మొదటి వ్యక్తి
5) ప్లాస్టిక్ రహదారుల సృష్టికర్త (ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా)కి పద్మశ్రీ పురస్కారం దక్కింది. ఆయన ఎవరు ?
జ: ప్రొఫెసర్ రాజగోపాలన్ వాసుదేవన్
6) మహిళలు లేని ఇళ్ళల్లో పురుషులకు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏ పథకం కింద గ్యాస్ సిలిండర్లు అందిస్తారు ?
జ: ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన
7) నవకల్పనల కోసం సర్కారీ బడులకు కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తం నిధులు కేటాయించింది ?
జ: రూ.69.74 కోట్లు
8) ఇటీవల చనిపోయిన సుప్రియా దేవి ఏ రంగానికి చెందిన వారు
జ: సినిమాలు (బెంగాలీ నటి)
9) పంజాబ్ హరిత విప్లవంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త చనిపోయారు. ఆయన పేరేంటి ?
జ: గురుచరణ్ సింగ్ కల్కట్
10) ఐపీఎల్ వేలంలో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ రూ.12.5 కోట్లకు ఏ ఫ్రాంచైజ్ దక్కించుకుంది ?
జ: రాజస్థాన్ రాయల్స్
11) ముస్లింలు ప్రతి శుక్రవారం జరిపే సామూహిక ప్రార్థన జుమ్మాకి కేరళలో ఓ మహిళ మొదటిసారిగా ఇమామ్ గా వ్యహరిస్తున్నారు. ఆమె పేరేంటి ?
జ: జమిత
12) 2017 సంవత్సరపు పదంగా ఆక్స్ ఫర్డ్ హిందీ నిఘంటువు ఏ పదాన్ని ఎంపిక చేసింది ?
జ: ఆధార్

13) ది ట్యాల్ మ్యాన్ పేరుతో విడుదలైన పుస్తకాన్ని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో ఎవరి గురించి రాశారు ?
జ: బిజూ పట్నాయక్
14) దేశవ్యాప్తంగా జనవరి 27న పల్స్ పోలియా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు ?
జ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
15) ప్రపంచంలో ఎక్కడి నుంచైనా మౌఖిక ఆదేశంతో పలికేందుకు ఆలిండియా రేడియో ఎవరితో ఒప్పందం కుదర్చుకుంది ?
జ: అమెజాన్ ఎకో సర్వీస్

అంతర్జాతీయం
16) ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి ఎవరు
జ: నిక్కీ హేలీ
17) ప్రపంచంలోనే శక్తిమంతమైన రాకెట్ స్పేస్ ఎక్స్ సంస్థ విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగం ఏ దేశంలో జరిగింది ?
జ: అమెరికా
18) భారత్ అంటే బిజినెస్ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ఎక్కువ సార్లు ప్రస్తావనకు వచ్చింది. దీన్ని ఎవరు ప్రస్తావించారు ?
జ: భారత ప్రధాని నరేంద్ర మోడీ (నోట్: దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రసంగిస్తూ ఈ మాట అన్నారు )