27 FEB 2020 CURRENT AFFAIRS QUIZ ( TS & AP )

క్విజ్ రూపంలో రాయడానికి ఈ లింక్ క్లిక్ చేయండి

http://telanganaexams.com/27-feb-2020-current-affairs-quiz-ts-ap/

01) ఐదుసార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిన మరియ షరపోవా  (రష్యా ) 2020 ఫిబ్రవరి 26న రిటైర్డ్ అవుతున్నట్టు ప్రకటించింది.  తన 17యేళ్ళ వయస్సులో మొదట ఎప్పుడు తొలి గ్రాండ్ స్లామ్ వింబుల్డన్ టైటిల్ గెలిచింది. ?

ఎ) 2004

బి) 2005

సి) 2006

డి) 2007

జ:  ఎ సరైనది (2004)

 

02) తెలంగాణ రాష్ట్రంలో ఉద్యాన పంటల ఉత్పాదకతను పెంచేందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించేందుకు ఏ దేశం ముందుకు వచ్చింది ?

ఎ) జర్మనీ

బి) రష్యా

సి) నెదర్లాండ్స్

డి) ఇజ్రాయెల్

జ: సి సరైనది ( నెదర్లాండ్స్)

03) 2020 ఫిబ్రవరి 26 నాడు కేంద్ర కేబినెట్ నిర్ణయాలకు సంబంధించి సరైన ప్రకటనలను గుర్తించండి

ఎ) అద్దె గర్భ నియంత్రణపై రాజ్యసభ సెలెక్ట్ కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకొని అద్దె గర్భాల నియంత్రణ బిల్లు 2019లో మార్పులు చేయాలని నిర్ణయించింది

బి) రూ.1480 కోట్లతో నేషనల్ టెక్నికల్ టెక్స్ టైల్ మిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

సి) టెక్స్ టైల్ మిషన్ కాలపరిమితి 2020-21 నుంచి 2023-24 వరకూ ఉంటుంది.

డి) వ్యవసాయం, రహదారులు, రైల్వే ట్రాక్ లు, సాఫ్ట్ వేర్, వైద్యం-ఆరోగ్యం, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, అగ్ని నిరోధక జాకెట్లు, రోదసీ ప్రయోగాల్లో ఈ టెక్స్ టైల్స్ మిషన్ ను ఉపయోగిస్తారు

ఇ) కేంద్ర చట్టాలన్నీ జమ్ము కశ్మీర్ లో అమలయ్యేలా మంత్రి వర్గం నిర్ణయం తీసుకొంది.

ఎఫ్) ఇరాన్ లోని ఛాబహార్ లో చేపట్టిన నౌకాశ్రయం పనులు 6 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది

1) ఎ,బి,సి,డి సరైనవి

2) అన్నీ సరైనవి

3) ఎ,డి,ఇ సరైనవి

4) ఎ,బి,సి,ఇ సరైనవి

జ: 2 అన్నీ సరైనవి

04) 2019కి సంబంధించి హురూన్ సంస్థ విడుదల చేసిన 9వ అంతర్జాతీయ ధనవంతుల జాబితా 2020లో మొదటి 10 స్థానాల్లో చోటు దక్కించుకున్న భారతీయ కుబేరుడు ఎవరు ?

1) ముకేష్ అంబానీ

2) అజీమ్ ప్రేమ్ జీ

3) శివ్ నాడార్

4) ఉదయ్ కొఠాక్

జ: 1 సరైనది ( ముకేష్ అంబానీ)

నోట్: అంబానీ సంపద 13 బిలియన్ డాలర్లకు పెరిగింది అంటే దాదాపు రూ.4.8లక్షల కోట్లతో 9 వ స్థానంలో నిలిచారు

 

05) 2019కి సంబంధించి హురూన్ సంస్థ విడుదల చేసిన 9వ అంతర్జాతీయ ధనవంతుల జాబితా 2020లో మొదటి 3 స్థానాల్లో నిలిచినది ఎవరు ?

1) జెఫ్ బెజోస్,  బిల్ గేట్స్, మార్క్ జుకెర్ బర్గ్

2) జెఫ్ బోజెస్, బెర్నార్డ్ ఆర్నాల్ట్, బిల్ గేట్స్

3) జెఫ్ బెజోస్, బెర్నార్డ్ ఆర్నాల్ట్, ముకేష్ అంబానీ

4) జెఫ్ బెజోస్, ల్యారీ పేజ్, స్టీవ్ బాల్మన్

జ: 2 సరైనది (జెఫ్ బోజెస్, బెర్నార్డ్ ఆర్నాల్ట్, బిల్ గేట్స్)

 

06) గృహ హింస, సైబర్ నేరాల్లో మహిళలకు గైడెన్స్ ఇచ్చేందుకు ఉద్దేశించిన ఏ యాప్ ను తెలంగాణలోని సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇటీవల రిలీజ్ చేశారు ?

1) దిశ

2) హాక్ ఐ

3) దిక్సూచి

4) షీ సేఫ్

జ: 4 సరైనది  ( షీ సేఫ్ )

 

07) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని గ్రామ న్యాయాలయాలు ( విలేజ్ కోర్టులు ) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 26న ఉత్తర్వులు జారీ చేసింది ?

1) 42

2) 46

3) 13

4) 48

జ: 1 సరైనది ( 42 విలేజ్ కోర్టులు )

 

08) లైట్ మెట్రో, మోడ్రన్ ట్రామ్ నెట్ వర్క్ తో మొదటి ఆధునిక రైల్వే వ్యవస్థను ఏపీలోని ఏ నగరంలో ఏర్పాటు చేయనున్నారు ?

1) విశాఖపట్నం

2) విజయవాడ

3) అమరావతి

4) కర్నూలు

జ: 1 సరైనది (విశాఖ)

09) కటక్ లో జరుగుతున్న ఖేలో ఇండియా అఖిల భారత విశ్వవిద్యాలయాల క్రీడల్లో పురుషుల బ్యాడ్మింటన్ టీమ్ విభాగంలో ఛాంపియన్ గా నిలిచిన యూనివర్సిటీ జట్టు ఏది ?

1) ఉస్మానియా యూనివర్సిటీ

2) శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ

3) ఆంధ్ర యూనివర్సిటీ

4) కాకతీయ యూనివర్సిటీ

జ: 3 సరైనది ( ఆంధ్ర యూనివర్సిటీ జట్టు )

10) దేశంలో ఏ మూడు ఉత్పత్తుల ధరలు ఆకస్మికంగా పతనమైతే ఆపరేషన్స్ గ్రీన్ కింద అధికంగా ఉన్న ఉత్పత్తిని కోల్డ్ స్టోరేజీలకు తరలించేందుకు వీలుగా పోర్టల్ (వెబ్ సైట్ ) ను కేంద్ర ఆహార శుద్ధి శాఖ మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ ఢిల్లీలో ఆవిష్కరించారు ?

1) టమాటా, మిర్చి, ఉల్లి

2) టమాటా, ఉల్లి, కందిపప్పు

3) టమాటా, ఉల్లి, ఆలు గడ్డలు

4) టమాటా, ఆలు, అరటి

జ: 3 సరైనది (టమాటా, ఉల్లి, ఆలు గడ్డలు)