28 AUG CURRENT AFFAIRS QUIZ

28 AUG CURRENT AFFAIRS QUIZ

1. చిన్నచిన్న నగరాలకు విమాన యాన సౌకర్యాన్ని కల్పంచడానికి ఉద్దేశించిన ఉడాన్ స్కీమ్ నాలుగో రౌండ్ లో భాగంగా ఎన్ని రూట్లకి అదనంగా ఈ సౌకర్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?

2. ఇన్సూరెన్స్ పాలసీలు కొనే టైమ్ లో ఎదరయ్యే ఇబ్బందులను తొలగించేందుకు స్మార్ట్ అసిస్ట్ పేరుతో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చిన సంస్థ ఏది ?

3. 2020-21 సంవత్సరానికి భారత్ వృద్ధి రేటు ఎంత శాతంగా ఉండొచ్చని 2019-20 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక నివేదికలో పేర్కొంది ?

4. అండమాన్ లోని ఆదిమ మానవులకూ కరోనా సోకింది. స్ట్రెయిట్ దీవిలో ఉండే  గ్రేట్ అండమానీస్ తెగలో పది మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు డాక్టర్లు గుర్తించారు.  ఈ అరుదైన తెగలో మొత్తం ఎంతమంది మనుషులు ఉన్నారు ?

5. ప్రపంచంలోనే మొదటిసారిగా 200 బిలియన్ డాలర్లు ( దాదాపు రూ.15లక్షల కోట్లు ) సంపదను అధిగమించిన మొదటి వ్యక్తిగా ఎవరిని బ్లూమ్ బర్గ్ బిలయనీర్ సూచీ ప్రకటించింది ?

6. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రాష్ట్రాలే వర్గీకరించుకోవచ్చని పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.  అయితే గతంలో ఏ కేసును పున:పరిశీలించాలని కోర్టు స్పష్టం చేసింది ?

7. లిబర్టీ సేవింగ్స్ అకౌంట్ పేరుతో భారతీయ యువతకి కొత్త అకౌంట్ ను ప్రారంభించిన బ్యాంక్ ఏది ?

8. తెలంగాణలోని రామగుండం ఎరువుల కర్మాగారం ( RFCL) లో 2020 నవంబర్ 15 నుంచి ఉత్పత్తి ప్రారంభించనున్నారు.  ఇక్కడ తయారయ్యే యూరియా బ్రండ్ నేమ్ ఏంటి ?

9. బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా ( BCSBI) ను మూసివేయాలని నిర్ణయించిన సంస్థ ఏది ?

10. ప్రధాన మంత్రి జన్ ధన్ ఖాతాదారులకు ఉచితంగా లైఫ్,యాక్సిడెట్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన స్కీమ్స్ ను అర్హులైన వారికి వర్తింప చేస్తారు. దీంతో దాదాపు ఎంతమందికి మేలు జరిగే అవకాశముంది ?