28 FEB 2020 CURRENT AFFAIRS ( TS & AP )

క్విజ్ రూపంలో రాయాలనుకుంటే ఈ కింది లింక్ క్లిక్ చేయండి

http://telanganaexams.com/28-feb-2020-current-affairs-quiz-ts-ap/

01) కరోనా వైరస్ (కోవిడ్ 19)తో 30 దేశాలు గడ గడలాడుతున్నాయి.  ఈ వైరస్ వ్యాప్తి కాకుండా విదేశీ పర్యాటకుల వీసాలు రద్దు చేసిన గల్ఫ్ దేశం ఏది ?

ఎ) సౌదీ అరేబియా

బి) ఒమన్

సి) ఇరాన్

డి) కువైట్

జ: ఎ సరైనది

 

02) సౌర కుటుంబానికి వెలుపల, భూమికి రెట్టింపు పరిమాణంలో ఉన్న (భూమితో పోలిస్తే దీని వ్యాసార్థం 2.5 రెట్లు ఎక్కువ) K2-18B అనే గ్రహంలో జీవుల మనుగడకు వీలుందని బ్రిటన్ లో భారత సంతతికి చెందిన నిక్కు మధుసూదన్ బృందం పరిశోధనలు చేస్తోంది.  ఈ K2-18B గ్రహం మనకు ఎన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ?

ఎ) 130

బి) 120

సి) 124

డి) 190

జ: సి సరైనది (124)

 

03)  గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రాథమిక వైద్యం అందించేందుకు విలేజ్ క్లినిక్స్ ను ఆంధ్రప్రదేశ్ లో అమల్లోకి తేవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. అలాగే రాష్ట్రంలోని 60 లక్షల మంది చిన్నారులకు దంత వైద్య పరీక్షలు నిర్వహించేందుకు  డాక్టర్ వైఎస్సార్ చిరునవ్వును ఎప్పటి నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు ?

ఎ) 2020 జులై 8

బి) 2020 జూన్ 2

సి) 2020 జులై 6

డి) 2020 జులై 9

జ: ఎ సరైనది

 

04) ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 35, 36 స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్ అందుకున్న సీనియర్ పాత్రికేయుడు ఎవరు ?

ఎ) ప్రియదర్శిని రామ్

బి) రాధాకృష్ణ

సి) ఏబీకే ప్రసాద్

డి) టంకశాల అశోక్

జ: సి సరైనది

 

05) ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ రెండేళ్ళలోపే రెండు కోట్ల మంది కస్టమర్ల మార్క్ ను అధిగమించింది.  దేశవ్యాప్తంగా ఎన్ని బ్రాంచ్ ల ద్వారా పోస్టాఫీసుల్లో 1.9లక్షల మంది పోస్ట్ మ్యాన్ ల ద్వారా కస్టమర్ల ఇంటి దగ్గరే బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది ?

ఎ) 1.36 లక్షలు

బి) 1.96 లక్షలుః

సి) 1.47 లక్షలు

డి) 1.56 లక్షలు

జ: ఎ సరైనది

 

06) అంతర్జాతీయ అరటి సదస్సు ఇటీవల ఈ కింద ఏ నగరాల్లో ICAR నిర్వహించింది ?

ఎ) గాంధీ నగర్

బి) తిరుచురాపల్లి

సి) కొచ్చిన్

డి) తిరువనంతపురం

జ: బి సరైనది

 

07) 5G హ్యాకథాన్ ను ఇటీవల ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ఆవిష్కరించింది ?

ఎ) NITI Aayog

బి) Ministry of Science and Technology

సి) Ministry of Human Resource and Development

డి) Ministry of Communications

Ans: డి సరైనది

 

08) అభయ్ కుమార్ సింగ్ ను ఇటీవల ఏ ప్రభుత్వ రంగ సంస్థకి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించారు ?

ఎ) NTPC లిమిటెడ్

బి) ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్

సి) NHPC లిమిటెడ్

డి) పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్

జ: సి సరైనది

 

09) 2020 ఫిబ్రవరి 24నాడు మొదటి ఏడాది పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకం ఏది

ఎ) ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ( PM KISAN)

బి) ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ( PM KMY)

సి) ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన ( PM SYM)

డి) ప్రధాన్ మంత్రి లఘు వ్యాపారి మాన్ ధన్ యోజన్

జ: బి సరైనది

 

10) BIMSTEC లో ఇప్పుడు ఎన్ని దేశాలు ఉన్నాయి ?

ఎ) 7

బి) 6

సి) 5

డి) 8

జ: ఎ సరైనది