29 FEB 2020 CURRENT AFFAIRS ( TS & AP )

29 FEB 2020 CURRENT AFFAIRS ( TS & AP )

 

01) విద్యుత్ వినియోగంలో తెలంగాణ కొత్త రికార్డులను అధిగమించింది.  ఉమ్మడి రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ డిమాండ్ 13,162 మెగావాట్లు ఉంటే... ఇప్పుడు ఎంతగా నమోదవుతోంది ?

1) 13,168 మె.వా

2) 14,163 మె.వా

3) 13,172 మె.వా

4) 13,182 మె.వా

జ: 1 సరైనది

 

02) హైదరాబాద్ సహా దేశంలోని 100కు పైగా నగరాల్లో యాచకులకు పునరావసం కల్పించి, వారికి శిక్షణ ఇవ్వడం ద్వారా స్వయం సమృద్ధి సాధించేందుకు కేంద్ర సామాజిక న్యాయ శాఖ నిర్ణయించింది.  అందుకోసం  హైదరాబాద్ సహా ఎన్ని నగరాల్లో ఈ ప్రాజెక్టును మొదలుపెడుతున్నారు.

1) 90

2) 10

3) 12

4) 14

జ: 2 సరైనది

నోట్: మొదటగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై, బెంగళూరు, ఇండోర్, పట్నా, నాగ్ పూర్, లఖ్ నవూ నగరాల్లో ఈ ప్రాజెక్ట్ ను మొదలు పెడుతున్నారు. 2020 ఏప్రిల్ 1 నుంచి ఈ ప్రక్రియ మొదలువుతంది.  అందుకోం 2020-21 బడ్జెట్ లో రూ.100 కోట్ల నిధులను కేంద్రం కేటాయించింది

 

03) భారత మొదటి భూ పరీశీలనా ఉపగ్రహం జీశాట్ 1 ను (2,268 కేజీలు) GSLV 10 వ్యోమ నౌక ద్వారా 2020 మార్చి 5న ప్రయోగించడానికి ఇస్రో ఏర్పాట్లు చేసింది.  మొత్తంగా GSLV ద్వారా జీశాట్ 1 సహా ఇప్పటిదాకా ఎన్ని వ్యోమ నౌకలను ఇస్రో ప్రయోగించింది ?

1) 12

2) 10

3) 24

4) 14

జ: 4 సరైనది

 

04) భారతీయ తీర గస్తీ విధుల్లో కొత్తగా IPO వరదన్ ను కేంద్ర షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి మన్ సుఖ్ మాండవీయ ప్రారంభించారు. ఈ నౌక ఏ తీరంలో పనిచేస్తుంది ?

1) విశాఖపట్నం

2) కొచ్చి

3) పారాదీప్

4) ముంబై

జ: 3 సరైనది

 

05) టోక్యో ఒలింపిక్స్ వరకూ భారత బ్యాడ్మింటన్ సింగిల్స్ కోచ్ గా ఇండోనేసియాకి చెందిన ఎవరిని నియమిస్తూ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది ?

1) అగుస్ డ్విసాంటోసో

2) కిమ్ జి హ్యూన్

3) అజయ్ హ్యూన్

4) సున్ యాంగ్

జ: 1 సరైనది

 

06) 2020 సెప్టెంబర్ లో జరిగే ఆసియా క్రికెట్ కప్  వేదికను పాకిస్థాన్ నుంచి ఎక్కడికి మార్చారు ?

1) దుబాయ్

2) ఢాకా

3) కొలొంబో

4) న్యూఢిల్లీ

జ: 1 సరైనది

 

07) స్మార్ట్ సిటీ ఎంపవరింగ్ ఇండియా అవార్డులు 2019 లో భాగంగా స్మార్ట్ మొబిలిటీ ప్రాజెక్ట్ విభాగంలో అవార్డు అందుకున్న ఏపీకి చెందిన సంస్థ ఏది ?

1) AP Beverages Corporation Ltd

2) APSRTC

3) AP Foods

4) AP Forest Development Corporation Ltd

జ: 2 సరైనది

 

08) దేశంలోనే మొదటిసారిగా రూ.4.70 కోట్లతో జైల్లోనే స్కిల్ డెవలప్ మెంట్ మాడ్యులర్ ఫర్నిచర్ యూనిట్ ను ఎక్కడ నెలకొల్పనున్నారు ?

1) చర్లపల్లి

2) రాజమండ్రి

3) కడప

4) చంచల్ గూడా

జ: 3 సరైనది

 

09) ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల్లో మధ్యాహ్న భోజనానికి సంబంధించిన ఫిర్యాదులపై స్పందించేందుకు ఓ యాప్ ను రూపొందించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.  ఇక్కడ అమలవుతున్న పథకం పేరేంటి ?

1) జగనన్న గోరుముద్ద

2) వైఎస్సార్ గోరుముద్ద

3) విజయమ్మ గోరుముద్ధ

4) ఎన్టీఆర్ గోరుముద్ద

జ: 1 సరైనది

 

10) ఇటీవల వార్తల్లోకి వచ్చిన బాబ్ ఐగర్ ఏ సంస్థలో 15యేళ్ళుగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేస్తూ రాజీనామా చేశారు ?

1) Netflix

2) Walt Disney Company

3) Warner Bros

4) Pixar

జ: 2 సరైనది