29 JAN CURRENT AFFAIRS

ఆంధ్రప్రదేశ్
1) ఏపీలో సూర్యారాధన కార్యక్రమం భారీ ఎత్తున జరిగింది. ఈ కార్యక్రమానికి నినాదం ఏంటి ?
జ: సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్
2) అమరావతిలో యూనివర్సల్ పీస్ రీట్రీట్ సెంటర్ ను ఏ సంస్థ ప్రారంభించనుంది
జ: బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం

జాతీయం
3) భూగర్భ జలాల పెంపునకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వం పథకం ఏది ?
జ: అటల్ భూ జల్ యోజన
4) అటల్ భూ జల్ యోజనకు కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది ?
జ: రూ.6 వేల కోట్లు
(నోట్: గుజరాత్, మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ ల్లోని 78 జిల్లాల్లో దీన్ని అమలు చేస్తారు )
5) ప్రస్తుత కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ ( CIC) ఎవరు ?
జ: ఆర్ .కె.మాథుర్
6) రిపబ్లిక్ డే వేడుకల సందర్బంగా ఢిల్లీ రాజ్ పథ్ లో నిర్వహించిన శకటాల ప్రదర్శనలో ఉత్తమ అవార్డు గెలుచుకున్న శకటం ఏది ?
జ: ఛత్రపతి శివాజీ పట్టాభిషేక ఘట్టాన్ని తెలిపే శకటం (మహారాష్ట్ర ప్రభుత్వం )
7) ప్రధాని నరేంద్ర మోడీ విదేశాంగ విధానానికి రూపశిల్పిగా చెప్పే ఎవరు పదవీ విరమణ చేశారు ?
జ: జై శంకర్
8) ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆటజం, మానసిక సమస్యలు, మేధో వైకల్యం, యాసిడ్ దాడి బాధితులకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు DOPT ఆదేశాలిచ్చింది
జ: 3 శాతం
9) పద్మశ్రీ అవార్డును తిరస్కరించిన ఆధ్యాత్మిక గురువు ఎవరు ?
జ: సిద్ధేశ్వర్ స్వామీజీ
10)తక్కువ ఖర్చుతో సాఫీగా జీవనం సాగించేందుకు అనువైన దేశాల్లో భారత్ స్థానం ఎంత ?
జ: రెండో స్థానం
(నోట్: మొదటి స్థానం దక్షిణాఫ్రికాకి దక్కింది )
11)ఏ రెండు విద్యా పథకాలను కేంద్ర ప్రభుత్వం విలీనం చేసేందుకు ఈనెల 30న జాతీయ సదస్సు నిర్వహిస్తోంది ?
జ: సర్వ శిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్
12) రికార్డు కలెక్షన్లతో చరిత్ర సృష్టించిన ఏ బ్లాక్ బస్టర్ మూవీపై IIM అహ్మదాబాద్ విద్యార్థులు స్టడీ చేయనున్నారు ?
జ: బాహుబలి
13) బెంగళూరులో ఐపీఎల్ 11వ సీజన్ కోసం జరిగిన వేలం పాటల్లో భారత్ పేసర్ జైదేవ్ ఉనద్కత్ ఎంత ధర పలికాడు ?
జ: రూ.11.5 కోట్లు
14) ప్రపంచ క్రికెట్ టెస్ట్ ర్యాంకింగ్స్ లో 912 పాయింట్లతో లారాను అధిగమించిన క్రికెటర్ ఎవరు ?
జ: కోహ్లీ

అంతర్జాతీయం
15) ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్షిప్ టోర్నీ గెలుచుకున్న క్రీడాకారుడు ఎవరు
జ: రోజర్ ఫెదరర్
(నోట్: ఇది 20వ గ్రాండ్ స్లామ్ టైటిల్. ఫైనల్లో రోజర్ మారిన్ సిలిచ్ ను ఓడించాడు)
16) ప్రపంచ వ్యాప్తంగా ఫర్నిచర్ సామ్రాజ్యాన్ని విస్తరించిన IKEA వ్యవస్థాపకుడు స్టాక్ హోంలో చనిపోయారు. ఆయన పేరేంటి ?
జ: ఇంగ్వర్ కంప్రాడ్
17) ఏటీఎంల్లో క్షణాల్లో డబ్బులు ఖాళీ చేసే సైబర్ ఎటాక్ అమెరికాలో జరుగుతోంది. దాని పేరేంటి ?
జ: జాక్ పాటింగ్

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, అభ్యర్థుల కోసం ఈ కింది వాట్సాప్, టెలిగ్రాం, ఫేస్ బుక్ ఖాతాలను ఓపెన్ చేశాం. జాయిన్ అవగలరు.

1) AP TRT&TET (Whatsapp)
https://chat.whatsapp.com/9fIgnM2qIwDF9xjjvyHQjP

2) ANDHRAEXAMS.COM (Whatsapp)
https://chat.whatsapp.com/Dx8wlXbujoo8V9RxX6ZbMx

3) AP TRT & TET ( TELEGRAM)
https://t.me/joinchat/GPhsigzvdsrqGJnUDu2KQg

4) ANDHRA EXAMS (FACE BOOK PAGE)
https://www.facebook.com/Andhra-exams-180377329217436/

5) ANDHRA EXAMS ( TELEGRAM GROUP)

https://t.me/joinchat/AAAAAEONuGBol_CX0Ks_zQ