30 JAN CURRENT AFAAIRS

ఆంధ్రప్రదేశ్
1) 2017-18 కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారం దేశీయ పర్యాటకులు అత్యధికంగా వచ్చిన ఐదు రాష్ట్రాల్లో ఏపీ పొజిషన్ ఎంత
జ: 3 వ స్థానం
2) వస్తు, సేవల విదేశీ ఎగుమతుల్లో రాష్ట్రానికి ఎన్నో స్థానం లభించింది
జ: 9 వ స్థానం ( 2.8 శాతం)
3) దేశంలో 18 హరిత విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్రం అంగీకరించింది. ఇందులో భాగంగా ఏపీలో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు
జ: ఉత్తరాంధ్రలోని భోగాపురం, రాయలసీమలోని ఓర్వకల్లు
4) ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వాయు కాలుష్య స్థాయి పెరిగిందని ఢిల్లీకి చెందిన గ్రీన్ పీస్ ఇండియా సంస్థ నివేదికలో పేర్కొంది. రెండు రాష్ట్రాల్లో ఎన్ని నగరాల్లో కాలుష్య స్థాయి అధికంగా ఉంది
జ: ఏపీ - 15, తెలంగాణలో 11 నగరాల్లో
5) అరకు వ్యాలీ కాఫీ పొడి ఇక ఇన్ స్టెంట్ కాఫీగా మార్కెట్లో లభించనుంది. ఏ సంస్థ ద్వారా వీటిని సప్లయ్ చేస్తారు ?
జ: ఏపీ జీసీసీ
6) వేటూరి సాహితీ పురస్కార గ్రహీత ఎవరు
జ: సినీ గేయ రచయిత చంద్రబోస్

జాతీయం
7) కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారం ఈ ఏడాది, వచ్చే ఏడాదికి వ్రుద్ధి రేటు ఎంతగా అంచనా వేశారు
జ: 6.75 (2017-18), 7 - 7.5 (2018-19)
8) గత ఏడాది ఆగస్టు 23 ప్రాతిపదికగా జాతీయ తలసరి ఆదాయం ఎంతగా ఆర్థిక సర్వేలో ప్రకటించారు
జ: రూ.1,03,219 ( చాలా ఇంపార్టెంట్ బిట్ )
9) రైతుల ఆదాయాన్ని ఎప్పటి లోగా రెట్టింపు చేసేలా పథకాలు చేపడతామని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో చెప్పారు ?
జ: 2022
10) దేశంలో అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశ పరీక్షల నిర్వహణ కోసం ఏ పేరుతో స్వతంత్ర్య వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు
జ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
11) అమెరికా పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ ఆఫీస్ ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్వెస్టర్స్ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్న భారతీయులు ఎవరు
జ: ప్రొ. ఆరోగ్య స్వామి జోసెఫ్ పాల్ రాజ్, సుమితా మిత్రా
12) జపాన్ కాన్సుల్ జనరల్ సీజీ బాబా చేతుల మీదుగా అత్యుత్తమ వ్యాపార నాయకత్వానికి ఇచ్చే 2018 గ్రాండ్ మోనొజుకురి అవార్డును ఎవరు అందుకున్నారు
జ: అమర్ రాజా ఛైర్మన్ రామ చంద్ర ఎన్ గల్లా
13) టాటా స్టీల్ చాలెంజర్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారతీయ ఆటగాడు ఎవరు
జ: విదిత్ సంతోష్