31 JAN CURRENT AFFAIRS

ఆంధ్రప్రదేశ్
1) 60సి నిబంధన కింద పోలవరం పనులను ఏ సంస్థకు అప్పగించారు
జ: నవయుగ
2) రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ రైతులకు ట్రాక్టర్ల కొనుగోలుకు ఇచ్చే రాయితీ పథకం పేరేంటి
జ: రైతు రథం
3) ఒంగోలు ట్రిపుల్ ఐటీకి ఏమని పేరు మార్చారు
జ: అబ్దుల్ కలామ్ ట్రిపుల్ ఐటీ
4) ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఎయిమ్స్ ఏర్పాటుపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది
జ: మంగళగిరి
5) అనంతపురం జిల్లాలో లేపాక్షి ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి
జ: మార్చి 9, 10 తేదీల్లో

జాతీయం

6) ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాల స్థానంలో భారత్ కి ఎన్నో స్థానం లభించింది
జ: ఆరో స్థానం
7) సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల పెంచిన జీతాలు అమల్లోకి వచ్చాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి నెలసరి వేతనం ఎంత ?
జ: రూ.2.80 లక్షలు ( గతంలో రూ.1.00 లక్ష)
8) సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల నెలసరి వేతనం ఎంత
జ: రూ.2.50 లక్షలు ( గతంలో రూ.90,000)
9) హైకోర్టు న్యాయమూర్తుల నెలసరి వేతనం ఎంతకు పెరిగింది
జ: రూ.2.25 లక్షలు (గతంలో రూ.80 వేలు)
10) ప్రస్తుత జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ ఎవరు
జ: రేఖా శర్మ
11) ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ఎవరు
జ: రజనీష్ కుమార్
12) 2021 నాటికి ప్రాంతీయ భాషల్లో నెట్ ఉపయోగించే వారి శాతం ఎంత ఉంటుందని టైమ్స్ ఇంటర్నెట్ అధ్యయనంలో తెలిపింది
జ: 75శాతం మంది
13) రాష్ట్ర మంచ్ పేరిట కొత్త రాజకీయ వేదికను న్యూఢిల్లీలో ఎవరు ఏర్పాటు చేశారు
జ: యశ్వంత్ సిన్హా
14) భారత టేబుల్ టెన్నిస్ లో వరుసగా ఎనిమిదోసారి జాతీయ ఛాంపియన్ గా నిలిచి రికార్డు సాధించిన ఆటగాడు ఎవరు
జ: ఆచంట శరత్