20 JAN CURRENT AFFAIRS

ఆంధ్రప్రదేశ్
1) గన్నవరం నుంచి ముంబైకి ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమాన సర్వీసులను ఎవరు ప్రారంభించారు ?
జ: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు

2) 21యేళ్ళకే బోయింగ్ 777 విమానం నడిపి తొలి మహిళా కమాండర్ గా గుర్తింపు పొందిన విజయవాడ అమ్మాయి ఎవరు ?
జ: యానీ దివ్య
3) రాష్ట్ర ఎన్నిక ప్రధానఅధికారిగా ( Chief Electrol Officer-CEO) ఎవరు నియమితులయ్యారు ?
జ: రామ్ ప్రకాశ్ సిసోడియా

జాతీయం
4) వివిధ రంగాల్లో విశేష క్రుషి చేసి అరుదైన విజయాలు నమోదు చేసిన ఎంతమందికి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అవార్డులు ప్రకటించింది ?
జ: 112 మందికి
(నోట్: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ అవార్డులు అందజేశారు )
5) సామాజిక ఆర్థిక బదిలీ సంస్థ (ఐసెక్) 47 వ సంస్థాపక దినోత్సవ వేడుకలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ వేడుకలు ఎక్కడ జరిగాయి ?
జ: బెంగళూరు
6) మధ్యప్రదేశ్ గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: ఆనందిబెన్ ( గుజరాత్ మాజీ సీఎం)
7) లాభదాయక పదవులు (పార్లమెంటరీ సెక్రటరీలు) తీసుకున్నందుకు ఏ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతికి సిఫార్సు చేసింది
జ: ఆప్ ఎమ్మెల్యేలు
8) లాభదాయక కార్యాలయం అనే పదాన్ని రాజ్యాంగంలో ఏ అధికరణంలో ఉపయోగించారు
జ: 102(1)
9) కేంద్ర ప్రభుత్వ ఆకర్షణీయ నగరాల ప్రాజెక్టులో (స్మార్ట్ సిటీస్) లో మరో 9 పట్టణాలు చేరాయి. దీంతో మొత్తం ఎన్నింటికి కేంద్రం నిధులు అందించనుంది ?
జ: 99 పట్టణాలు
10) ఇటీవల వివాదస్పదమైన బీటీ-3 విత్తనం ఏ పంటకు సంబంధించినది ?
జ: పత్తి
11) వచ్చే నైరుతి సీజన్ లో ఎల్ నినో లేదా లానినాల్లో ఏ వాతావరణ పరిస్థితులు ఉంటాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది ?
జ: లానినా ( వర్షాలు ఎక్కువగా పడతాయి )
(నోట్ : ఎల్ నినో అంటే వర్షాలు తక్కువగా పడటం)
12) నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) డైరక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: సుదీప్ లఖ్డావాలా
(నోట్: 1984 BATCH తెలంగాణ క్యాడర్ IPS అధికారి)
13) దివ్యాంగుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి దాకా 917 వెబ్ సైట్లను రూపొందింది. ఏ ప్రాజెక్టు కింద వీటిని చేపట్టినట్టు కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ తెలిపారు
జ: Website Accessibility Project
14) ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) ఎగ్జిక్యూటివ్ బోర్డు కొత్త ఛైర్మన్ గా ఎవరు ఎంపికయ్యారు ?
జ: హరీష్ మన్వానీ
15) ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ గా 2018 సంవత్సరానికి ఎన్నికైన తెలుగు వ్యక్తి ఎవరు ?
జ:ఆహ్లాదరావు
16) వ్యర్థ కాలుష్యాల కారణంగా బెంగళూరులోని ఏ చెరువులో మంటలు చెలరేగాయి
జ: బెళ్ళందూరు చెరువులో
17) అండర్ 19 ప్రపంచ కప్ ను భారత్ యువ జట్టు గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్ లో ఏ జట్టును ఓడించింది ?
జ: జింబాబ్వే

అంతర్జాతీయం
18) ద్రవ్య వినిమయ బిల్లుకు సెనేటల్ లో ఆమోదం లభించకపోవడంతో ప్రభుత్వ కార్యకలాపాలు (షట్ డౌన్) అయిన సంఘటన ఏ దేశంలో నిలిచిపోయింది
జ: అమెరికాలో
19) అమెరికా షట్ డౌన్ వల్ల వారికిని ఎన్నివేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లే అవకాశముంది
జ: 42 వేల కోట్లు (6.5 బిలియన్ డాలర్లు)
20) ప్రధాని పదవిలో ఉండగా తల్లి కాబోతున్నట్టు ప్రకటించిన జసిందా అర్డెన్ ఏ దేశానికి ప్రధాని ?
జ: న్యూజిలాండ్
21) క్షిపణి సాంకేతిక నియంత్రణ కూటమి, వాసెనార్ గ్రూపుతో పాటు ఆస్ట్రేలియాకి చెందిన మరే కీలక గ్రూపులో భారత్ కు స్థానం దక్కింది ?
జ: జీవ, రసాయన ఆయుధాల నియంత్రణ సంస్థ
22) చైనాపై తిరుగులేని పట్టు సంపాదించిన ఎవరి ఆలోచనలను తమ దేశ రాజ్యాంగంలో చేర్చాలని నిర్ణయించారు ?
జ: అధ్యక్షుడు షి జిన్ పింగ్