Wednesday, October 23

ఏపీ సెట్స్ తేదీలు విడుదల

ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. అన్ని సెట్ లను ఆన్ లైన్ లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గతంలో పరీక్షల నిర్వహణ ఆలస్యం కావడం వల్ల మన విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారని చెప్పారు. అందుకే ఈసారి ముందుగానే షెడ్యూల్ ప్రకటించామన్నారు.

మొత్తం ఏడు సెట్ లను కూడా ఆన్ లైన్ లో నిర్వహిస్తారు.

ఏపీ సెట్స్ షెడ్యూల్ వివరాలు:

ఏపీ ఈ సెట్ ఏప్రిల్ 19(అనంతపురం జేఎన్టీయూ)

ఏపీ ఐ సెట్ ఏప్రిల్ 26(ఎస్వీయూ)

ఏపీ పీజీ సెట్ మే 1 నుంచి(ఏయూ)

ఏపీ ఎడ్ సెట్ మే 6 (ఎస్వీయూ)

ఏపీ లా సెట్ మే 6(ఎస్కేయూ)

ఏపీ పీఈ సెట్ మే 5 నుంచి(నాగార్జున)

ఏపీ ఎంసెట్ ఏప్రిల్ 20 నుంచి(కాకినాడ జేఎన్టీయూ)