డిగ్రీకి మూడో విడత కౌన్సిలింగ్

రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు మూడో విడత ఆన్ లైన్ అడ్మిషన్ల ప్రక్రియ గురువారం నుంచి మొదలవుతోంది. ఇప్పటికే 2 విడతల ఆన్ లైన్ కౌన్సిలింగ్ ద్వారా 2,60,103 డిగ్రీ సీట్లను ఉన్నత విద్యామండలి భర్తీ చేసింది. మిగిలిన సీట్లకు గురువారం మూడో విడత కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతోంది.
ఎవరికి అవకాశం ?
\
- కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే విద్యార్థులకు
- ఇంతకు ముందు రెండు విడతల కౌన్సిలింగ్ కు రిజిస్ట్రేషన్ చేసుకొని సీటు లభించని వారికి
- రెండు విడతల కౌన్సిలింగ్ సీట్లు పొంది సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా కాలేజీలో నేరుగా రిపోర్టు చేయనివారికి
- గతంలో కౌన్సిలింగ్ లో సీట్లు పొంది కాలేజీ మార్పును కోరుకునే వారికి అవకాశం
కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇది
రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల నమోదు, గత అడ్మిషన్లు రద్దు : మార్చి 4,5
సీట్ల కేటాయింపు : మార్చి 6
కాలేజీలో రిపోర్టింగ్ : మార్చి 8
స్పాట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ : మార్చి 9
స్పాట్ అడ్మిషన్ల అప్ లోడింగ్ : మార్చి 10-15