APలో తలసరి ఆదాయంలో కృష్ణా జిల్లా టాప్

2020-21 గణాంకాలు రూపొందించిన ప్రణాళికా శాఖ
- 2020-21 తలసరి ఆదాయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా అగ్రస్థానంలో ఉంది.
- ఉమ్మడి విశాఖ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. శ్రీకాకుళం జిల్లా చివరి స్థానంలో ఉందని రాష్ట్ర ప్రణాళికా శాఖ తెలిపింది.
- 2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రణాళికాశాఖ ఉమ్మడి జిల్లాల వారీగా తలసరి ఆదాయ గణాంకాలను రూపొందించింది.
- కృష్ణా జిల్లాలో అత్యధికంగా 2020-21లో రూ.63 లక్షల తలసరి ఆదాయం ఉన్నట్టు తెలిపింది.
- విశాఖపట్నం జిల్లాలో తలసరి ఆదాయం రూ.43 లక్షలు, శ్రీకాకుళం జిల్లాలో రూ.1.24 లక్షలు ఉన్నట్లు తెలిపింది.
- 2019-20తో పోలిస్తే 2020-21లో ఒక్క కృష్ణా జిల్లాలో తప్ప మిగతా అన్ని జిల్లాల్లో తలసరి ఆదాయంలో వృద్ధి నమోదైందని ఆ గణాంకాలు తెలిపాయి.